దుమ్ము కణాల్లోనూ కరోనా వైరస్

దుమ్ము కణాల్లోనూ కరోనా వైరస్

రోమ్ : కరోనా వైరస్ గురించి మరో ఆందోళనకర విషయం బయటపడింది. ఈ వైరస్ దుమ్ము కణాల్లోనూ ఉంటుందని ఇటలీ సైంటిస్టులు కనుగొన్నారు. ఇవి దుమ్ము ద్వారా ఎంత దూరం ప్రయాణించగలవు దీని ద్వారా వైరస్ మనుషులకు సోకుతుందా అన్న దానిపై మరింత స్డడీ అవసరముందని తెలిపారు. ఇటీవలే మురుగు నీటిలో, సాధారణ జలాల్లోనూ ఈ వైరస్ ను గుర్తించారు. దీంతో కరోనా వైరస్ గాలి, నీరు ఇలా అంతటా వ్యాప్తి చెందుతోందని సైంటిస్టులు చెబుతున్నారు. బొలాన్యా యూనివర్సిటీ ఫ్రొఫెసర్ లియోనార్డో టీమ్ రెండు ప్రాంతాల్లో దుమ్ము కణాలను సేకరించి టెస్ట్ చేశారు. ఈ టెస్ట్ ల్లో కరోనా జన్యువు ఉన్నట్లు గుర్తించామని లియోనార్డో తెలిపారు. వాయు కాలుష్యంలో కణాలు ఎక్కువగా ఉంటే కరోనా ఇన్ ఫెక్షన్ తీవ్రత అధికంగా ఉంటుందని ఆయన చెప్పారు. కాలుష్య కణాలను మెక్రో ఫ్లైట్స్ గా ఆయన అభివర్ణించారు. ఐదు మైక్రాన్ల కన్నా తక్కువ వ్యాసం కలిగిన తుంపర్లు ఎండను బట్టి నిమిషాల నుంచి గంటల వరకు గాలిలో ప్రయాణిస్తుంటాయన్నారు. ఐతే ఇంత తక్కువ మైక్రాన్లు ఉండే తుంపర్ల ద్వారా కరోనా సోకుతుందని నిర్ధారణకు -రాలేదని చెప్పారు.