తిరుగుబాటు ఇంకా బతికే ఉంది

తిరుగుబాటు ఇంకా బతికే ఉంది

ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై జరిపిన క్షిపణి దాడులపై ఇరాన్‌ అగ్రనేత అయతోల్లా అలీ ఖమేనీ తీవ్రంగా స్పందించారు. తాము నిన్న(మంగళవారం) రాత్రి కేవలం ఇరాక్‌లో ఉన్న అమెరికా స్థావరాలపై క్షిపణి దాడులు చేశామని తెలిపారు. ఈ దాడులతో తమలో కూడా తిరుగుబాటు ఇంకా బతికే ఉందని నిరూపించామని చెప్పారు. ఈ క్షిపణి దాడులు అమెరికాకు చెంపపెట్టులాంటిది మాత్రమేనన్నారు. తాము చేసే ప్రతీకార దాడులు, సైనిక చర్యలతో సులేమానీ తిరిగిరారని.. తమకు జరిగిన నష్టాన్ని పూరించలేవన్నారు.అమెరికా స్ధావరాలపై జరిగిన దాడులు కేవలం ఆరంభం మాత్రమేనని మున్ముందు ఇలాంటివి చూడడానికి అమెరికా సిద్ధంగా ఉండాలని ఖమేనీ హెచ్చరించారు. ఈ ప్రాంతంలో అమెరికా ప్రాబల్యాన్ని, ఉనికిని అంతమొందించడమే మా లక్ష్యమని స్పష్టం చేశారు ఖమేనీ.

పవిత్ర ఖోమ్ నగరంలో ఇరాన్ అగ్రశ్రేణి సైనిక జనరల్ ఖాసిమ్ సులేమానికి నివాళులు అర్పించిన తర్వాత.. అలీ ఖమేనీ ఈ వ్యాఖ్యలు చేశారు.