నిందితులకు 4,738 సంవత్సరాల శిక్ష విధించిన కోర్టు

నిందితులకు 4,738 సంవత్సరాల శిక్ష విధించిన కోర్టు

పాకిస్థాన్: ఓ కేసుకు సంబంధించి ఒక సంస్థ నాయకుడు మరియు కార్యకర్తలకు యాంటీ టెర్రరిజం కోర్ట్ 4,738 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. తెహ్రీక్-ఎ-లబ్బాయిక్ పాకిస్తాన్ (టిఎల్పీ) చీఫ్ ఖాదీమ్ హుస్సేన్ రిజ్వీ, ఆయన సోదరుడు, మేనల్లుడు మరియు మరో 87 మంది కార్యకర్తలకు అందరికీ కలిపి 4,738 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 13 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. అంతేకాకుండా నిందితులకు సంబంధించిన స్థిర మరియు చరాస్తులన్నింటినీ జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది.

రావల్పిండి జడ్జి షౌకత్ కమల్ దార్ గురువారం అర్థరాత్రి ఈ ఉత్తర్వులను జారీచేశారు. నిందితులకు ఒక్కొక్కరికి 55 సంవత్సరాల జైలు శిక్ష మరియు రూ. 1,35,000 రూపాయల జరిమానా విధించింది. నిందితులు ఎవరైనా ఈ జరిమానా చెల్లించకపోతే.. ఆ నిందితుడికి 146 సంవత్సరాల అదనపు జైలు శిక్ష పడుతుందని కూడా కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

రావల్పిండి ATCలో ఈ కేసు విచారణ జరుగుతున్నప్పుడు కోర్టు బయట భద్రతను కట్టుదిట్టం చేశారు. కోర్టు ఉత్తర్వులు వెలువడిన తర్వాత.. ఎలైట్ ఫోర్స్ మరియు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నిందితులందరినీ మూడు బస్సుల్లో ఎక్కించి అతోక్ జైలుకు తరలించారు.

ఆసియా బీబీ అనే క్రైస్తవ మహిళ దైవదూషణ కేసులో 2010లో మరణశిక్షకు గురయింది. అయితే సుప్రీంకోర్టు జోక్యంతో ఆ మహిళ విడుదల చేయబడింది. దాంతో టీఎల్పీ నాయకత్వంలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఆ గొడవలకు సబంధించి టీఎల్పీ చీఫ్ ఖాదీమ్ హుస్సేన్ రిజ్వీ, ఆయన సోదరుడు అమీర్ హుస్సేన్ రిజ్వీ, మేనల్లుడు ముహమ్మద్ అలీతో పాటు మరో 87 మంది ఇతర కార్యకర్తలను పోలీసులు నవంబర్ 24, 2018న అరెస్టు చేశారు. నిరసనల నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం, మతాధికారులతో నాలుగు అంశాల ఒప్పందం కుదుర్చుకోవడంతో నిరసనలు ఆగిపోయాయి. ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు తీర్పు వెలువడింది.

For More News..

పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పోటీకి పాక్ శరణార్థి

తెలంగాణలో రెండేండ్లుంటే చాలు ‘లోకలే’

మరో ఏడాదిలో ఏపీ సీఎంగా వైఎస్ భారతి!