కరోనాతో పురుషుల సంతానోత్పత్తిపై ఎఫెక్ట్!

కరోనాతో పురుషుల సంతానోత్పత్తిపై ఎఫెక్ట్!

కరోనా వల్ల పురుషులకు కొత్త సమస్యలు వస్తున్నాయని తెలుస్తోంది. ఈ వైరస్ వల్ల పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తగ్గుతుందని, సంతానోత్పత్తి కూడా రెడ్యూస్ అవుతుందని శాస్త్రీయంగా జరిపిన ఓ  అధ్యయనంలో బయటపడింది. కరోనా సోకిన పురుషుల్లో చనిపోతున్న శుక్ర కణాల సంఖ్య ఎక్కువగా ఉంటోందని, వారు అధిక ఒత్తిడికి లోనవడాన్ని కూడా గమనించామని సదరు స్టడీలో తెేలింది.

మగవారి పునరుత్పత్తి వ్యవస్థపై కరోనా దాడి చేస్తోందని దాని వల్ల శుక్ర కణాల నాణ్యత క్షీణిస్తోందని అధ్యయనంలో పాల్గొన్న రీసెర్చర్స్ చెప్పారు. అయితే పురుషుల్లో సంతానోత్పత్తిపై కరోనా ప్రభావం చూపుతోందన్న విషయం ఇంకా నిర్ధారణ కాలేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. పురుషులు జాగ్రత్తగా ఉండటం మేలని సూచిస్తున్నారు. జర్మనీలోని జస్టస్ లైబిగ్ యూనివర్సిటీలో పని చేస్తున్న బెహ్జాద్ హజిజదే మలేకీ, బక్త్‌‌యార్ తార్తిబియాన్‌‌లు ఈ స్టడీని నిర్వహించారు. రీసెర్చ్‌‌లో భాగంగా 60 రోజుల పాటు కరోనా సోకిన 84 మంది పురుషుల డేటాను.. ఆరోగ్యంగా ఉన్న 105 మంది మగవారి డేటాతో పోల్చి చూశారు.