సీపీఐ నేత బినోయ్ విశ్వంను అడ్డుకున్న పోలీసులు..

సీపీఐ నేత  బినోయ్ విశ్వంను అడ్డుకున్న పోలీసులు..


హనుమకొండ జిల్లా  గుండ్ల సింగారంలో భూపోరాట బాధితులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బినోయ్ విశ్వం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హనుమకొండలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. సీపీఐ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బినోయ్ విశ్వంను పోలీసులు అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తూ... సీపీఐ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై భైఠాయించి నిరసన తెలిపారు. ఆ తర్వాత పోలీసులు బినోయ్ విశ్వంతో పాటు సీపీఐ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి..సుబేధారి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

 ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై ఎంపీ బినోయ్ విశ్వం విమర్శలు గుప్పించారు. తెలంగాణాలో  భూములు అన్యాక్రాంతం అవుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. వరంగల్ లో కుంటలు, చెరువులు కబ్జాకు గురవుతుంటే ప్రభుత్వ యంత్రాంగం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కానీ ఇండ్లు లేని పేదలు.. గుడిసెలు వేసుకుంటే మాత్రం అడ్డుకుంటోందన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం హామీని సీఎం కేసీఆర్ నెరవేర్చనందుకే ప్రజలు రోడ్డెక్కారని ఎంపీ బినోయ్ విశ్వం తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం

ధాన్యం సేకరణపై సీఎం సమీక్ష

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ రాజీనామా

వివాదంగా మారిన గుడిసెల తొలగింపు