సిగరెట్లు మరింత కాస్లీ

సిగరెట్లు మరింత కాస్లీ

పొగ రాయుళ్లకు నిర్మలా సీతారామన్ బ్యాడ్ న్యూస్ చెప్పారు. సిగరెట్లపై కస్టమ్స్ డ్యూటీ 16శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. కేంద్రం నిర్ణయంతో పొగరాయుళ్లు సిగరెట్ కోసం మరింత ఖర్చు చేయాల్సి రానుంది. సిగరెట్లపై కస్టమ్స్ డ్యూటీని గత మూడేళ్లుగా పెంచలేదు. తాజా పెంపుతో దేశవ్యాప్తంగా వివిధ బ్రాండ్లకు చెందిన సిగరెట్ రేట్లు పెరగనున్నాయి.

కస్టమ్స్ డ్యూటీ పెంపు నిర్ణయంతో సిగరెట్ తయారీ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. గాడ్ ఫ్రే ఫిలిప్స్ షేర్లు 4.29శాతం క్షీణించగా.. గోల్డెన్ టొబాకో 3.81, ఎన్టీసీ ఇండస్ట్రీస్ 1.4, ఐటీసీ షేర్లు 0.78 శాతం మేర లాస్ అయ్యాయి.