జాబ్ ఇప్పిస్తానని నమ్మించి.. రూ. 46 లక్షలు కాజేశారు

జాబ్ ఇప్పిస్తానని నమ్మించి.. రూ. 46 లక్షలు కాజేశారు

నిరుద్యోగులే టార్గెట్ గా ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. జాబ్ ఇప్పిస్తామంటూ వారివద్ద నుంచి లక్షల్లో కాజేస్తున్నారు. ఇలాంటి వార్తలు తరచూ వింటూనే ఉంటాం. కానీ ఎన్ని వార్తలు వచ్చినా.. కొంత మందిలో మాత్రం మార్పు రావడం లేదు. సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడి అమాయకులు నిండా మునిగిపోతున్నారు. జాబ్‌ వస్తుందన్న ఆశతో కేటుగాళ్లు అడినన్ని డబ్బులు ఇచ్చి మోసపోతూనే ఉన్నారు. చివరకు పోలీసులను ఆశ్రయిస్తుంటారు బాధితులు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆన్ లైన్ లో జాబ్ అని నమ్మించి.. బాధిత మహిళ నుంచి లక్షల్లో డబ్బులు కొట్టేశారు. 

సైబర్ నేరగాళ్ల వలలో పడి ఓ మహిళ రూ. 46 లక్షలు పొగుట్టుకుంది. ఆన్ లైన్ జాబ్ అంటూ 2023 మే 15న అమీన్ పూర్ లో ఉండే మహిళకి మెసేజ్ రావడంతో.. ఇంట్లో ఉండి ఉద్యోగం చేసుకోవచ్చని ఆశపడింది. దీంతో వారు చెప్పినట్టు మొదట రూ. 2 వేలు డిపాజిట్ చేసింది. అనంతరం ఆ మహిళను  నమ్మించడానికి సైబర్ నేరగాళ్లు రూ. 3 వేలు పంపించారు. దీంతో బాధిత మహిళ తనకు నిజమేనని మంచి జాబ్ దొరికిందని నమ్మింది. ఆ తర్వాత పలు దాఫాలుగా రూ. 46 లక్షలు సైబర్ నేరగాళ్ల ఖాతాలో ఇన్వెస్ట్ చేసింది. కమిషన్ ఇవ్వాలని అడగడంతో అవతలి వ్యక్తులు స్పందించలేదు. దీంతో మోసపోయానని నమ్మిన మహిళ చివరకు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ ని ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.