శవపేటికలో నుంచి చప్పుడు చేసిన చనిపోయిందనుకున్న మహిళ.. ఆ తర్వాతేమైందంటే..

శవపేటికలో నుంచి చప్పుడు చేసిన చనిపోయిందనుకున్న మహిళ.. ఆ తర్వాతేమైందంటే..

చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగి లేచి వస్తే ఎలా ఉంటుంది..? అదీ శవ పేటికలో పెట్టిన తర్వాత లోపలి నుంచి శబ్ధాలు వస్తే ఎలా ఉంటుంది..? ఇవి మాట్లాడుకోవడానికి, చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుందేమో. కానీ అదే రియల్ లైఫ్ లో జరిగితే..! రియాక్షన్ మామూలుగా ఉండదు కదా..! అదే తరహాలో ఈక్వెడార్ లో ఓ చనిపోయిన మహిళను అంత్యక్రియలు చేసేందుకు శవ పేటికలో పెట్టారు. అంతలోనే ఆమె లోపల నుంచి పెట్టెను కొట్టడం ప్రారంభించింది. దీంతో అక్కడున్న బంధువులు, సన్నిహితులు ఘోరమైన షాక్ కు, భయాందోళనలకు గురయ్యారు.

ఈక్వెడార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, బెల్లా మోంటోయా అనే మహిళ రిటైర్డ్ నర్సు. ఇటీవలే  ఆమె బాబాహోయోలోని మార్టిన్ ఇకాజా హాస్పిటల్‌లో ఇంటెన్సివ్ కేర్‌లో చేరారు. ఆమెకు స్ట్రోక్, కార్డియోపల్మోనరీ అరెస్ట్‌కు గురయ్యే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. రోగికి చికిత్స చేసిన వైద్యులు, ఆమె ట్రీట్మెంట్ కు స్పందించకపోవడంతో ఆమె చనిపోయినట్లు ప్రకటించారు. అనంతరం మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఆమె కుమారుడికి అందజేశారు.

"ఎమర్జెన్సీ గదికి తీసుకువచ్చినప్పుడు నా తల్లి అపస్మారక స్థితిలో ఉంది. కొన్ని గంటల తర్వాత, ఆమె చనిపోయిందని డాక్టర్ నాకు తెలియజేశారు. గుర్తింపు పత్రాలు, మరణ ధృవీకరణ పత్రాన్ని అందజేశారు" అని ఆమె కుమారుడు గిల్బెర్టో బార్బెరా అసోసియేటెడ్ అన్నారు. తదనంతరం అంత్యక్రియల కోసం కుటుంబం మోంటోయాను ఇంటికి తీసుకువచ్చింది. అకస్మాత్తుగా, బంధువులు శవపేటిక నుండి వింత శబ్దం రావడం గమనించారు. దీంతో భయపడిన కుటుంబ సభ్యులు చెక్క పెట్టెను తెరవాలని నిర్ణయించుకున్నారు. తెరిచిన తర్వాత, మహిళ బరువుగా ఊపిరి పీల్చుకోవడం చూశారు.

తాము దాదాపు 20 మంది అక్కడ ఉన్నామని, దాదాపు ఐదు గంటల తర్వాత, శవపేటిక శబ్దం చేయడం ప్రారంభించిందని ఆమె కొడుకు చెప్పాడు. తన తల్లి శవపేటిక లోపలి నుంచి కొట్టిందని, తాము దగ్గరికి వెళ్లినప్పుడు ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకోవడం తమకు కనిపించిందని చెప్పారు. అనంతరం కుటుంబ సభ్యులు ఆమెను అదే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. "ఆమె ఇంట్యూబేషన్‌లో ఉంది మరియు వైద్యులు ఆమె రోగ నిరూపణ గురించి బంధువులకు పెద్దగా ఆశ చూపడం లేదు" అని బార్బెరా చెప్పారు.

శవాగారంలోని ఫ్రిజ్‌లో 'చనిపోయిన' మహిళ సజీవంగా కనిపించింది

ఇటువంటి షాకింగ్ సంఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు 2018లో ఒక దక్షిణాఫ్రికా మహిళ మార్చురీ ఫ్రిజ్‌లో సజీవంగా కనుగొనబడింది. ఓ నివేదిక ప్రకారం ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు ప్రకటించబడింది. అనంతరం ఆమెను గౌటెంగ్ ప్రావిన్స్‌లోని కార్లెటన్‌విల్లేకి తీసుకెళ్లారు. అయితే మార్చురీలో ఉంచిన మృతదేహాన్ని పరిశీలించేందుకు వెళ్లిన ఓ శవాగార కార్మికుడు.. ఆ మహిళ ఊపిరి పీల్చుకుంటున్నట్లు గుర్తించడం అందర్నీ షాక్ కు గురి చేసింది.