బార్డర్ వివాదంపై పార్లమెంట్‌లో చర్చించాలె

బార్డర్ వివాదంపై పార్లమెంట్‌లో చర్చించాలె

న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దు వివాదంపై వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలని మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. దేశ ప్రజలను కేంద్ర ప్రభుత్వం విభజిస్తోందని విమర్శించారు. సరిహద్దు సమస్యపై చర్చించడానికి అవసరమైతే లోక్ సభ రూల్ 248 కింద సమావేశాలను సీక్రెట్‌గా నిర్వహించుకోవచ్చన్నారు. చైనాతో వివాదంపై ప్రధాని మోడీ వ్యూహాత్మక మౌనం వహిస్తున్నారని.. ఇది అస్పష్టతకు దారితీస్తోందన్నారు. ఇది మన బలహీనతలను బీజింగ్‌కు తెలియజేయడమేనని పేర్కొన్నారు. 

‘ఇండో, చైనా సంబంధాలపై పార్లమెంట్‌లో పూర్తిస్థాయి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నాం. వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలకు అఖిలపక్ష ఎంపీల బృందాన్ని తీసుకెళ్లాలి. అప్పుడే పరిస్థితులపై ప్రజలకు మేం సరైన సమాచారం ఇవ్వగలం. 2014కు ముందు బార్డర్ సమస్య గురించి మోడీ బాగా మాట్లాడేవారు. అసలు సమస్య ఢిల్లీలోనే ఉందనేవారు. అవును ఇది నిజమే మరి. ఇప్పుడు కూడా సమస్య అక్కడే ఉంది. సీఎంగా ఉన్నప్పుడు నేషనల్ సెక్యూరిటీ గురించి మాట్లాడిన మోడీ.. పీఎం అయిన తర్వాత మాత్రం చైనా పేరును ప్రస్తావించడానికి కూడా సంకోచిస్తున్నారు’ అని ఒవైసీ దుయ్యబట్టారు. దేశ ప్రజల్ని కేంద్రం విభజిస్తోందన్నారు. దీని ప్రభావం పొరుగు దేశాలతో సంబంధాలపై చూపుతోందన్నారు. ఇది చైనాకు ప్రయోజనకరంగా మారిందన్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

మోడీ, యోగిలను బాంబులతో పేల్చేస్తా.. నెటిజన్ ట్వీట్

సోనుసూద్‌కు మద్దతుగా మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

నేను హిందువుని.. గుడికి వెళ్తే తప్పేంటి: కేజ్రీవాల్