శ్రీవారి సర్వదర్శనానికి పోటెత్తిన భక్తులు

శ్రీవారి సర్వదర్శనానికి పోటెత్తిన భక్తులు
  • కిటకిటలాడుతున్న క్యూలైన్లు 

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇవాళ వేకువజాము నుంచి స్వామి వారి సర్వదర్శనం టోకెన్ల కోసం భారీగా తరలివచ్చారు. దీంతో క్యూలైన్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కరోనా ఆంక్షలన్నీ దాదాపుగా ఎత్తివేయడంతో దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు కుటుంబ సమేతంగా తరలివస్తున్నారు.  రెండేళ్లుగా కరోనా ఆంక్షలతో దర్శనం చేసుకోలేకపోయామనే భావనతో ఉన్న వారు ఇప్పుడు అవకాశం వచ్చిందనే ఉద్దేశంతో తిరుమలకు భారీగా వస్తున్నారు. 
వరుస సెలవులు, వీకెండ్ కావడంతో తిరుమలకు భక్తుల తాకిడి మరింత పెరిగింది. శ్రీవారి సర్వదర్శనాల టిక్కెట్లను గోవింద రాజా స్వామి సత్రాలు., శ్రీనివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద కేటాయిస్తోంది టీటీడీ. తిరుపతిలోని కౌంటర్లలో శనివారం సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు ఏప్రిల్ 12వ తేదీ మంగళవారం నాటికి దర్శన స్లాట్ లభిస్తోంది. మంగళవారం నాటి స్లాట్ పూర్తి కాగానే టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేయనుంది. భక్తుల అధిక రద్దీ కారణంగా బుధవారం నాటి సర్వదర్శనం టోకెన్లు ఒక రోజు ముందు అనగా మంగళవారం మధ్యాహ్నం నుండి తిరుపతిలోని కౌంటర్లలో అందుబాటులో ఉంచనున్నారు.
దీంతో ఆది, సోమవారాల్లో దర్శన టోకెన్లు కేటాయింపును నిలిపివేయనున్నట్లు టీటీడీ ప్రకటింది. దీనికి అనుగుణంగా భక్తులు తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది. భక్తుల రాకతో అలిపిరితో పాటు తిరుమల ఘాట్ రోజ్లలో వాహనాల సంఖ్య పెరిగింది. వారాంతంలో వేలాది వాహనాలు అలిపిరి చెక్ పోస్ట్ వద్ద బారులు తీరుతున్నారు. సర్వదర్శన కౌంటర్ల వద్ద భక్తులు కూడా కిలోమీటర్ల మేర క్యూలైన్లో బారులు తీరారు. 

 

ఇవి కూడా చదవండి

అల్లు అర్జున్‌తో నటించాలని ఉంది

బిహార్లో ఏకంగా బ్రిడ్జినే దొంగిలించిన్రు

విల్ స్మిత్పై పదేళ్ల బ్యాన్ విధించిన అకాడమీ