పోస్టుల భర్తీ లేని మేనిఫెస్టోలు: దిలీప్  ఆచారి

పోస్టుల భర్తీ లేని మేనిఫెస్టోలు:  దిలీప్  ఆచారి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పోస్టుల భర్తీ, నిరుద్యోగ భృతి విషయాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్  పార్టీలు మేనిఫెస్టోలో పెట్టలేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దిలీప్  ఆచారి విమర్శించారు. శుక్రవారం బీజేపీ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్  పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు గ్యారెంటీగా అదే పార్టీలో ఉంటారా? అని ప్రశ్నించారు.

ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయకుండా, తన అనుచరులను తీసుకెళ్లి జాయిన్  చేస్తున్న విషయం రేవంత్ రెడ్డికి తెలియదా? అని ప్రశ్నించారు. అనంతరం ఎండబెట్ల గ్రామ యువకులు బీజేపీలో జాయిన్  అయ్యారు. సుధాకర్ రెడ్డి, రాము, ప్రమోద్  పాల్గొన్నారు.