బీచ్ లో.. బికినీలో సేద తీరుతుంటే.. కుక్కలు కరిచాయి

బీచ్ లో.. బికినీలో సేద తీరుతుంటే.. కుక్కలు కరిచాయి

ఇటీవల ఆన్‌లైన్‌లో పోస్ట్ ఒక ఫన్నీ వీడియో వైరల్ గా మారింది. ఈ ఇన్సిడెంట్ ఆస్ట్రేలియాలోని కె'గారి (ఫ్రేజర్ ద్వీపం) ఒడ్డున జరిగింది. విశ్రాంతి తీసుకుంటున్న ఒక మహిళా టూరిస్ట్‌పై డింగో (కుక్కలాంటి జంతువు) దాడి చేసింది. అక్కడ సూర్యనమస్కారాలు చేస్తున్న స్త్రీ దగ్గరకు వెళ్లి ఆమె బ్యాక్ సైడ్ పై రెండు సార్లు కొరికింది.

జంతువు తన శరీర భాగాన్ని పదేపదే కొరకడంతో బికినీ ధరించిన ఆ మహిళ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. డింగో దాడి నుండి తప్పించుకోవడానికి ఆమె వెంటనే లేచి అక్కడి నుండి పారిపోయింది. మహిళను ఫ్రెంచ్ టూరిస్ట్‌గా గుర్తిస్తూ మొత్తం సంఘటనను రికార్డ్ చేసిన వైల్డ్ ఫుటేజీని సోషల్ మీడియాలో న్యూస్ మీడియా అవుట్‌లెట్ షేర్ చేసింది. పర్యాటకురాలు 20 ఏళ్ల వయస్సు ఉంటుందని తెలుస్తోంది. ఈ డింగో దాడి ఏప్రిల్‌లో జరిగింది, అయితే, ఫుటేజ్ ఇటీవలే విడుదల కావడంతో రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది.

ALSO READ: విజయ్ ఒక ఊసరవెల్లి.. ఫస్ట్ డే షూట్ క్యాన్సిల్ 

డింగో దాడులు ఆ ప్రాంతంలో ఆందోళనలకు కారణమయ్యాయి. ఇటీవలే 10 ఏళ్ల బాలుడిని డింగో కరిచి నీటిలోకి లాగింది. బాలుడి అక్క అతన్ని రక్షించడానికి అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఇటువంటి సంఘటనల తరువాత, క్వీన్స్‌లాండ్ ఫ్రేజర్ ద్వీపంలో సమయం గడిపేటపుడు హాలిడే మేకర్‌లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇంటర్నెట్ యూజర్స్ లో ఒకరు హెచ్చరిక బోర్డులను కూడా కలిగి ఉన్న ప్రాంతాన్ని ఎత్తి చూపారు.

 

https://twitter.com/couriermail/status/1671734091220406277