ఇండియాపై తప్పుడు ప్రచారం చేస్తారా..చైనీస్ ఖాతాలపై ఫేస్బుక్ నిషేధం

ఇండియాపై తప్పుడు ప్రచారం చేస్తారా..చైనీస్ ఖాతాలపై ఫేస్బుక్ నిషేధం

ఫేస్బుక్  మాతృసంస్థ మెటా సంచలనం నిర్ణయం తీసుకుంది. మెటాకు సంబంధించిన అన్ని ఫ్లాట్ఫారమ్లలో ఫేక్ చైనీస్ ఖాతాలను తొలగించింది. భారతీయ వినియోగదారుల ముసుగులో దేశరాజకీయాలు..జాతీయ భద్రతా అంశాలపై మోసపూరిత, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న నకిలీ చైనీస్ ఖాతాలను శాశ్వతంగా డిలీట్ చేసింది ఫేస్బుక్. ప్రజాభిప్రాయాన్ని మార్చే కంటెంట్ ను పోస్ట్ చేస్తు్పన్నట్లు ప్రకటించింది. ఈ నకిలీ ఖాతాలతో అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున వాటిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా. 

జర్నలిస్టులు, లాయర్లు, మానవ హక్కుల సంఘాల కార్యకర్తలుగా నటిస్తూ.. కల్పిత వార్తల కంటెంట్ ను ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తున్నారని పేర్కొంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలైన టిబెట్, అరుణాచల్ ప్రదేశ్ ల ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నట్టు గుర్తించారు. ఈ కంటెంట్ ను కొంత హిందీ, ఇంగ్లీషు, చైనీస్ భాషల్లో రాస్తున్నట్లు తెలిపింది. ఈ వార్తలన్నీ అక్కడి టెబెట్ బహిష్కృత నేత  దలైలామా, అతని అనుచరుల పేరుతో ఈఫేక్ ఖాతాలు సృష్టించి చైనా నుంచి ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ కేంద్రంగా నడుస్తున్న ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ల ద్వారా.. ఇండియన్ ఆర్మీ, అథ్లెట్స్, సైంటిఫిక్ అచీవ్ మెంట్స్ పై తప్పుడు సమాచారం.. మణిపూర్ లో హింస, భారత ప్రభుత్వ అవినీతిపై తప్పుడు వార్తలు రాస్తు్న్నారు. ఈ కంటెంట్ నిజమే అని నమ్మించేందుకు ఒకరి పోస్టులపై ఒకరు కామెంట్లు చేయడం.. షేర్ చేయడం వంటి చర్యల ద్వారా ఫేక్ న్యూస్ వ్యాపింపజేస్తున్నారు. 

టెక్ దిగ్గజం మెటా తన అన్ని ఫ్లాట్ ఫారమ్ లనుంచి ఈ ఫేక్ ఖాతాలను, కంటెంట్ ను పూర్తిస్థాయిలో సమర్థవంతంగా తొలగించిందని ప్రకటించింది. 2023 ప్రారంభంలో చైనా నుంచి పుట్టుకొచ్చిన మోసపూరిత, ఫేక్ ఖాతాలను విస్తృతమైన నెట్ వర్క్ ను విజయవంతంగా తొలగించినట్లు మెటా వెల్లడించింది.