సూర్యాపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్ల ఆందోళన

సూర్యాపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్ల ఆందోళన

సూర్యాపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్లు ఆందోళన చేశారు. ఓ డ్రైవర్ మద్యం సేవించకున్నా బ్రీత్ ఎనలైజర్ మెషిన్ లో మద్యం సేవించినట్టుగా చూపించడంతో పెను వివాదం చెలరేగింది. మద్యం అలవాటు లేకున్నా మెషిన్ రిపోర్ట్ ఆధారంగా డ్రైవర్ కేవీ రావు ను విధుల నుంచి తొలగించిన ఆర్టీసీ డీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలానే కొంత మంది సిబ్బందిని విధుల నుంచి తప్పించారని ఆరోపిస్తూ గంటపాటు విధులు బహిష్కరించారు. డీఎం తీరుపై డ్రైవర్లు అసహనం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తల కోసం

నిజాయితీ చాటుకున్న ఆటోడ్రైవర్

ప్రధానిపై టీఆర్ఎస్ ఎంపీల ప్రివిలేజ్ మోషన్‌