
వజ్రాల వ్యాపారి.. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేలకోట్లకు టోపీ పెట్టిన నీరవ్ మోడీపై ఈడీ మళ్ళీ కొత్తగా ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. నీరవ్ మోడీ, అతని మామ మెహుల్ చోక్సీలు జరిపిన 13,500 కోట్ల PNB కుంభకోణాన్ని CBI,ED దర్యాప్తు చేస్తోంది. నీరవ్ ఈ మధ్యనే లండన్ వీధుల్లో యథేచ్ఛగా తిరుగుతున్నట్లు అక్కడి మీడియా ప్రసారం చేసింది. లండన్ లోని వెస్ట్ ఎండ్ లో విలాసవంతమైన 8 మిలియన్ పౌండ్ల విలువైన అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నట్టు, అక్కడ కొత్త వజ్రాల వ్యాపారం ప్రారంభించినట్టు బ్రిటిష్ వార్తాపత్రిక ద టెలిగ్రాఫ్ తెలిపింది. దీంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తాజాగా ముంబైలోని ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది.
ED దాఖలు చేసిన ఛార్జీషీట్ కు సంబంధించి నివేదిక UK హోం సెక్రటరీ పరిశీలించింది. దీంతో లండన్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టు నీరవ్ మోడీ పై త్వరలో అరెస్ట్ వారెంట్ జారీ చేసే అవకాశాలున్నాయి.