లంచ్ తర్వాత సోనియా గాంధీని విచారిస్తున్న ఈడీ

లంచ్ తర్వాత సోనియా గాంధీని విచారిస్తున్న ఈడీ

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈడీ అధికారులు  ప్రశ్నిస్తున్నారు . మధ్యాహ్నం 2 గంటలకు సోనియాకు లంచ్ విరామం ఇచ్చిన అధికారులు.. మధ్యాహ్నం 3గంటల తర్వాత మళ్లీ విచారణను ప్రారంభించారు. నేషనల్  హెరాల్డ్ కు సంబంధించిన కేసులో ఈడీ ప్రశ్నలు సంధిస్తోంది.  సోనియా వెంట ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు. సోనియా హెల్త్ కండీషన్ దృష్ట్యా ప్రియాంకను లాస్ట్ టైం విచారణకు అనుమతించారు. ఈసారి కూడా ప్రియాంకను ఈడీ అధికారులు అనుమతించారు.

మరోవైపు సోనియాపై ఈడీ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం దగ్గర మహిళా కార్యకర్తలునల్ల బెలూన్లతో నిరసన చేపట్టారు. ఈడీని రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించింది.

పార్లమెంటు లోని గాంధీ విగ్రహం నుంచి విజయ్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ ఎంపీలు. ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. విజయ్ చౌక్ దగ్గర నిరసన చేపట్టన కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, ఎంపీల మధ్య ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా... రంజిత్ రంజన్, కేసీ వేణుగోపాల్, మాణిక్యం ఠాగూర్, ఇమ్రాన్ ప్రతాప్ గర్హి, కె. సురేశ్ సహా పలువురు ఎంపీలను అరెస్టు చేశారు పోలీసులు. రాహుల్ గాంధీని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి చర్చించేందుకు పార్లమెంటుకు కాంగ్రెస్ ఎంపీలందరూ వచ్చారన్నారు రాహుల్. కానీ,, ఈ సమస్యలపై చర్చ జరగట్లేదన్నారు. ఇప్పుడేమో కాంగ్రెస్ ఎంపీలందర్నీ అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు రాహుల్ గాంధీ. 

ఇదే కేసులో ఈ నెల 21న సోనియాను రెండుగంటలకుపైగా ఈడీ ప్రశ్నించింది.  అధికారులు అడిగిన 28 ప్రశ్నలకు సమాధానమిచ్చారు సోనియా గాంధీ. కాంగ్రెస్ కు చెందిన నేషనల్  హెరాల్డ్  యాజమాన్యంలోని యంగ్  ఇండియన్  ప్రైవేట్  లిమిటెడ్ లో ఆర్థిక అవకతవకలపై ఈడీ విచారణ జరుపుతోంది.