ఈ కామర్స్ దిగ్గజాలపై ఈడీ దర్యాప్తు

ఈ కామర్స్ దిగ్గజాలపై ఈడీ దర్యాప్తు

విదేశీమారక ద్రవ్య నిబంధనల ఉల్లం ఘన ఆరోపణలపై ఈ-కామర్స్‌ ది గ్గజాలు అమెజాన్‌ , ఫ్లి ప్‌ కార్ట్‌‌‌‌లపై దర్యాప్తు చేస్తు న్నట్లు ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌ (ఈడీ) సో మవారం ఢిల్లీ హైకోర్టుకు వెల్లడించింది .ఫెమా కిం ద ఆ కంపెనీలపై కేసు రిజిస్టరైం దని కూడా ఈడీ తెలిపింది .ఎఫ్‌ డీఐ నిబంధనలు ఉల్లంఘించాయంటూ అమెజాన్‌ , ఫ్లి ప్‌ కార్ట్‌‌‌‌లపై దా ఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన ఢిల్లీ హైకోర్టు ఆ కేసును కొట్టివేసింది . ఈ రెండు కంపెనీలపై విచారణ చేపట్టాల్సింది గా అంతకుముందు ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది . దీంతో రెండు కంపెనీలపై ఫెమా కింద కేసును నమోదుచేసి,దర్యాప్తు మొదలుపెట్టినట్లు ఈడీ కోర్టుకు వెల్లడించింది . పర్యవసానంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టి వేయాల్సిందిగా కోర్టును ఈడీ కోరింది. స్వచ్ఛంద సంస్థ  టెలికం ‌వాచ్‌ డాగ్‌ ఈ పి ల్‌ ను దాఖలు చేసింది . ఎఫ్‌ డీఐ,ఫెమా నిబంధనల ఉల్లం ఘించినందుకు ఈ రెండు ఈ-కామర్స్‌ కంపెనీలపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది గా కోరుతూ పి ల్‌ దా ఖలైంది. ఎఫ్‌ డీఐ నిబంధనలు ఉల్లంఘించేందుకు ఈ కంపెనీలు చాలా సంస్థలను నె లకొల్పాయని స్వచ్ఛంద సంస్థ ఆరోపించింది.