
ICICI బ్యాంకు మాజీ CEO చందాకొచ్చర్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) ఎదుట విచారణకు హాజరయ్యారు. బ్యాంకు రుణాల కుంభకోణానికి సంబంధించి ED శుక్రవారం చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ డైరెక్టర్ వేణుగోపాల్ ధూత్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. ఈ కేసులో చందాకొచ్చర్‌ను అధికారులు ఇవాళ(శనివారం) తెల్లవారుజామున 4 గంటల వరకు విచారించారు. తిరిగి వెళ్లిన ఆమె మళ్లీ విచారణ కోసం ఈ మధ్యాహ్నం ED కార్యాలయానికి చేరుకున్నారు.