పండుగ సీజన్ ముందు తగ్గిన వంట నూనెల రేట్లు

పండుగ సీజన్ ముందు తగ్గిన వంట నూనెల రేట్లు

వంట నూనెల ధరలు గత నెల రోజులుగా తగ్గుతున్నట్టు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార , పౌర సరఫరాల శాఖ తెలిపింది. ట్యాక్సులపై  కేంద్ర ప్రభుత్వం కల్పించిన ప్రయోజనాన్ని కంపెనీలు కస్టమర్లకు బదిలీ చేయాలని కేంద్ర ఆహార శాఖ సూచించింది. దాంతో కంపెనీలు 15 నుంచి 25 శాతం దాకా ధరలు తగ్గించాయి. అంతర్జాతీయ ధరలు ఎక్కువగా ఉండటంతో కొన్ని నెలలుగా వంట నూనెల ధరలు పెరిగాయని, అయితే రాబోయే రోజుల్లో ఇంకా తగ్గే ఛాన్స్ ఉందని కంపెనీలు చెబుతున్నాయి.

ప్రధాన వంట నూనెల బ్రాండుల కంపెనీలైన... ఫార్చూన్ , రుచి గోల్డ్ , సన్ రిచ్, న్యూట్రెల్లా, ఫ్రీడమ్ సన్ ఫ్లవర్, ప్రియ బ్రాండ్స్ వంట నూనె ధరలు 20శాతం వరకూ తగ్గించాయి. ఈ ఏడాది మొదటి నుంచి సన్ ఫ్లవర్ నూనె ధర పెరుగుతూ లీటరు రేటు రూ.180కి  చేరింది. ఎలాగొలా సర్దుకుపోయి జీవించిన సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు తగ్గిన ధరలపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

మరో నాలుగు నెలల వరకూ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం లేదని తెలంగాణ ఆయిల్ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్  సురేష్ కుమార్ అగర్వాల్ తెలిపారు. రిఫైన్డ్ పామాయిల్ పై కస్టమ్స్ ట్యాక్స్ 17.5 నుంచి 12.5 శాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ తగ్గింపు 2022 మార్చి వరకు వర్తిస్తుంది. సన్ ఫ్లవర్, సోయాబీన్, పామాయిల్  దిగుమతులు కూడా పెరగడంతో రాబోయే 4 నెలలు నూనెల ధరలు నిలకడగా ఉంటాయంటున్నారు. తగ్గిన ధరలతో లీటర్ రూ.180 వరకు పలికిన రిఫైన్డ్ ఆయిల్ ప్రస్తుతం 130 రూపాయలు ఉండగా.. లీటర్ పామాయిల్ 110 రూపాయలు పలుకుతోంది. 

రెండు నెలలుగా ఆయిల్ మార్కెట్ డౌన్ అవుతోందంటున్నారు రిటైల్ ఆయిల్ వ్యాపారులు.  ప్రెసెంట్ మార్కెట్ తక్కువగా ఉన్నప్పటికీ... రేట్లు తగ్గడంతో పాటు రాబోయే పండుగల సీజన్ తో గిరాకీ పెరుగుతుందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ట్యాక్సులు తగ్గించడంతో రెండు నెలలుగా 20 నుంచి 25 శాతం వరకు ఆయిల్ ధరలు తగ్యి.  పండగల టైమ్ లో నూనెల ధరలు తగ్గడంతో జనం సంతోషంగా ఉన్నారు.

మరిన్ని వార్తల కోసం..

ఈ ఏడాది దేశంలో 126 పెద్దపులులు చనిపోయాయి

ఒమిక్రాన్ ఎఫెక్ట్.. జనవరి 2 వరకు ర్యాలీలు, సభలపై నిషేధం

గోవా టూ హైదరాబాద్ డ్రగ్స్.. క్రిప్టో కరెన్సీతో కొన్న ఇద్దరు యువకులు