ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్

ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఇప్పటి వరకు క్యూలో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసేందుకు అధికారులు అనుమతిచ్చారు. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ నిర్వహించారు. అలాగే 2,647 వార్డులు, 382 డివిజన్లలో పోలింగ్‌ జరిపారు. ఎన్నికల్లో మొత్తం 12,843 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఏకగ్రీవమైన వార్డులు, డివిజన్లను మినహాయించి మిగతా వాటికి పోలింగ్‌ జరిపారు ఎన్నికల అధికారులు.జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధికంగా ఆదిభట్లలో పోలింగ్ శాతం నమోదు కాగా…అత్యల్ఫంగా నిజాంపేట్ లో పోలింగ్ శాతం నమోదైంది.

మరోవైపు ఈనెల 24న ఒక్క కరీంనగర్‌ కార్పొరేషన్లో మాత్రం పోలింగ్‌ జరగనుంది.