EVM మెషిన్‌ మాక్ పోలింగ్‌లో.. బీజేపీకి ఎక్సట్రా ఓట్లు

EVM మెషిన్‌ మాక్ పోలింగ్‌లో.. బీజేపీకి ఎక్సట్రా ఓట్లు

కేరళాలోని కాసర్‌గోడ్ లోక్ సభ నియోజకవర్గంలో ఏప్రిల్ బుధవారం మాక్ పోలింగ్ నిర్వహించారు. అందులో ఓ నాలుగు ఈవీఎం మెషిన్లలో కమలం పువ్వు గుర్తుకు వేసిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు లెక్క చూపిస్తున్నాయని ఎల్డీఎఫ్, యూడిఎఫ్ పార్టీ అభ్యర్థుల ఏజెంట్లు ఆరోపించారు. కాసర్‌గోడ్ ఎల్డిఎఫ్ అభ్యర్థి, సీపీఎం నేత ఎంవి బాలకృష్ణన్ ఈవీఎం మెషన్ల లోపాలను పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 

ఫలితాలు తప్పుగా చూపించిన ఈవీఎం మెషిన్లను మార్చాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిని పలు పార్టీల నాయకులు కోరారు. ఓటింగ్ మెషిన్ పై అన్ని గుర్తుల కంటే కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తు చిన్నదిగా ఉందని దాన్ని మార్చాలని అధికారులకు సూచించారు. మొత్తం 190 ఈవీఎం మెషిన్లలో 20 ఈవీఎంలను ఒకే సారి టెస్ట్ చేశారు. 

Also Read: బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారం చేయొద్దు: హెచ్చరించిన మావోయిస్టులు

కాసర్‌గోడ్ నియోజకవర్గంలో నోటాతో కలిపి మొత్తం 10 గుర్తులు ఉన్నాయి. ఈ క్రమంలో ఒకసారి కలమం పువ్వుపై నొక్కితే వీవీప్యాట్ లో రెండు ఓట్లు నమోదవుతున్నాయని పోలింగ్ ఏజెంట్లు గుర్తించారు. మళ్లీ మళ్లీ ఈవీఎంలను పరిశీలించగా.. కొన్నిసార్లు అలాగే జరుగుతుందని, మరి ఇతర ఏ పార్టీ గుర్తులకు ఇలా ఎక్స్ ట్రా ఓట్లు పడట్లేదని వారు ఆరోపించారు. కౌంటింగ్ లో తప్పు జరిగితే అది ఈవీఎం మెషన్ లో పొరపాటు ఉందని ఆరోపిస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి బినుమోన్ నాలుగు ఓటింగ్ మెషన్లలో టెక్నికల్ ప్రాబ్లమ్ ఉన్నట్లు గుర్తించామని.. అవి ఫస్ట్ ఉన్న గుర్తునే వీవీప్యాట్ లో చూపిస్తున్నాయని తెలిపారు. రెండవ సారి టెస్ట్ చేసినప్పుడు రిజల్ట్స్ కరెక్ట్ గానే చూపించిందని ఆయన చెప్పారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కు రిపోర్ట్ ఇచ్చామని అన్నారు.