
ముంబై: మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌కు అండర్ వరల్డ్‌తో సంబంధాలు ఉన్నాయని బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించారు. ముంబై పేలుళ్ల కేసు దోషులతో నవాబ్ మాలిక్ భూలావాదేవీలు నెరిపారని అన్నారు. 1993లో ముంబైలో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడిన సలీం పటేల్, సర్దార్ షాహబ్ అలీ ఖాన్‌ల నుంచి చాలా తక్కు వ రేటుకు కాస్ట్లీ ఏరియాలో భూమని కొనుగోలు చేశారని అన్నారు. ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఉన్న అత్యంత ఖరీదైన ల్యాండ్‌ను నవాబ్ మాలిక్ కుటుంబానికి చెందిన కంపెనీ సాలిడస్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొన్నారని దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. ఆ ప్రాంతంలో చదరపు అడుగు స్థలం రూ.2,053 రూపాయలు ఉంటుందని, కానీ నవాబ్ మాలిక్ కొనుగోలు చేసింది కేవలం రూ.15కేనని అన్నారు. అండర్ వరల్డ్ దావూద్ ఇబ్రహీం చెల్లులు సహీనా పార్కర్, సలీమ్ పటేల్ కలిసి భూ కబ్జాలకు పాల్పడే వాళ్లని, వీళ్లు కబ్జా చేసిన ఒక భూమికి సంబంధించి పవర్ ఆఫ్ అటార్నీ పట్టా ముంబై పేలుళ్ల కేసు దోషి సలీం పటేల్ పేరుతో ఉందని, ఆ భూమిని నవాబ్ మాలిక్ కొనుగోలు చేశారని ఫడ్నవీస్ ఆరోపించారు.