రైతుల హృదయాలను గెలిచాను

రైతుల హృదయాలను గెలిచాను

రైతు చట్టాల రద్దుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులకు నచ్చిన విధంగా చేసి.. వారి  హృదయాల్ని గెలుచుకున్నానన్నారు మోడి. రైతుల బాధ తనకు అర్థమైందన్నారు. రైతుల ప్రయోజనాల కోసం వ్యవసాయ చట్టాలను అమలు చేశామని.. కానీ జాతీయ ప్రయోజనాల కోసం వాటిని వెనక్కి తీసుకున్నామని ప్రధాని తెలిపారు. దాదాపు ఏడాది కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనకు దిగారన్నారు.  మూడు వ్యవసాయ చట్టాలను రైతుల ప్రయోజనాల కోసం మాత్రమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. అయితే వాటిని ఇప్పుడు దేశ ప్రయోజనాల దృష్ట్యా ఉపసంహరించుకున్నామని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అన్నారు.

దీనిపై ఇక వివరించాల్సిన అవసరం లేదని తాను భావిస్తున్నానని తెలిపారు మోడీ. మేం ఎందుకీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో భవిష్యత్‌లో మరింత బాగా తెలుస్తుందన్నారు. తాను ఎల్లప్పుడూ రైతుల ప్రయోజనాల కోసం పనిచేశానన్నారు. ఎల్లప్పుడూ రైతులు తనకు మద్దతు ఇస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. "నేను రైతుల హృదయాలను గెలుచుకోవడానికి ప్రయాణం చేస్తున్న వ్యక్తిని. సన్నకారు భూములతో ఉన్న రైతుల బాధలను నేను అర్థం చేసుకున్నాను. నేను ఎల్లప్పుడూ వారి హృదయాలను గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను" అని మోడీ ఏఎన్ఐకు ఇచ్చిన ఇంటర్య్వూలో అన్నారు.

వ్యవసాయ బిల్లులపై రైతులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని అడిగిన ప్రశ్నకు మోడీ జవాబిచ్చారు. ప్రజాస్వామ్యంలో చర్చలే ప్రాతిపదిక అన్నారు. ప్రజాస్వామ్యంలో, దేశ ప్రజలతో చర్చలు జరపడం ప్రజా ప్రతినిధుల ప్రాథమిక కర్తవ్యమని ప్రధాని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఈ చర్చలలో పాల్గొంటుందన్నారు. అలాంటి చర్చలు ఆపడానికి తాము సిద్దంగా లేమన్నారు.  పాలసీలను రూపొందిస్తున్నప్పుడు వాటాదారులతో చర్చల ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు ప్రధాని. ప్రజల నుండి స్వీకరించిన ఫీడ్‌బ్యాక్‌పై ప్రభుత్వం పని చేయాలని తాను కోరుకుంటున్నానని ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు. 

ఇవి కూడా చదవండి: 

రెండు వారాలపాటు నిరసనలపై నిషేధం

నోట్లో దాచి బంగారం అక్రమ రవాణా