డాక్టర్ రెడ్డీస్ యూనిట్కు ఎఫ్డీఏ వీఏఐ క్లాసిఫికేషన్

డాక్టర్ రెడ్డీస్ యూనిట్కు  ఎఫ్డీఏ వీఏఐ క్లాసిఫికేషన్

న్యూఢిల్లీ: ఫార్మా కంపెనీ డాక్టర్​ రెడ్డీస్​ లాబొరేటరీస్​ లిమిటెడ్​  ఆంధ్రప్రదేశ్​  శ్రీకాకుళంలో ఉన్న తమ ఫార్ములేషన్స్​ తయారీ ప్లాంట్​కు యూఎస్​ ఫెడరల్ ​డ్రగ్స్​అడ్మినిస్ట్రేషన్​ నుంచి ఎస్టాబ్లిష్​మెంట్​ ఇన్​స్పెక్షన్​ రిపోర్ట్​ వచ్చిందని మంగళవారం తెలిపింది. ఈ ప్లాంట్​ను యూఎస్​ఎఫ్​డీఏ 'వాలంటరీ యాక్షన్​ ఇండికేటెడ్​ (వీఏఐ)'గా వర్గీకరించింది. 

ఎఫ్​డీఏ ఈ ఏడాది జులైలో  ప్లాంట్​లో జీఎంపీ, ప్రీ-అప్రూవల్​ ఇన్​స్పెక్షన్​ను నిర్వహించింది.  వీఏఐ క్లాసిఫికేషన్​ అంటే తనిఖీ సమయంలో అభ్యంతరకర పరిస్థితులు కనుగొన్నప్పటికీ, ఎఫ్​డీఏ చర్యలు తీసుకోదు. కంపెనీయే స్వచ్ఛందంగా ఆ సమస్యలను పరిష్కరించుకోవచ్చని డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబ్స్​ వర్గాలు తెలిపాయి.