చైనాలో ఘోర విమాన ప్రమాదం

చైనాలో ఘోర విమాన ప్రమాదం

చైనాలో దారుణం జరిగింది. 133 మందితో ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలింది. చైనాకు చెందిన చైనా ఈస్ట్రన్ కంపెనీకి చెందిన బోయింగ్ 737 విమానం గుయాన్జీ ప్రాంతంలో కూలిపోయింది. ప్రమాద సమయంలో ఫ్లైట్లో 123 మంది ప్యాసింజర్లు, 9 మంది సిబ్బంది ఉన్నారు. 

సోమవారం మధ్యాహ్నం చైనా ఈస్ట్రన్ కంపెనీ విమానం కున్మింగ్ సిటీ నుంచి బయలుదేరింది. టేకాఫ్ అయిన కాసేపటికే ఓ పర్వతాన్ని ఢీకొట్టింది. విమానం కూలిన ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రమాదం విషయం తెలిసిన సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో ఎంత మంది మృతి చెందారన్న విషయం ఇంకా తెలియలేదు. ప్రమాద తీవ్రతను చూస్తే ఫ్లైట్లోని వారెవరూ బతికే అవకాశంలేదని అధికారులు అంటున్నారు.

మరిన్ని వార్తల కోసం..

ది కశ్మీర్ ఫైల్స్ మూవీపై సీఎం కేసీఆర్ ఆగ్రహం

రాజకీయాలపై గులాం నబీ ఆసక్తికర వ్యాఖ్యలు