Kim Jong Un:బుల్లెట్ ఫ్రూఫ్ ట్రైన్లో చైనాకు కిమ్ జోంగ్ ఉన్.. ఏంటీట్రైన్ స్పెషల్.. తెలిస్తే ఆశ్చర్యపోతారు

Kim Jong Un:బుల్లెట్ ఫ్రూఫ్ ట్రైన్లో చైనాకు కిమ్ జోంగ్ ఉన్.. ఏంటీట్రైన్ స్పెషల్.. తెలిస్తే ఆశ్చర్యపోతారు

చైనా బల ప్రదర్శనకు సైనిక కవాతు చేస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం జరిగి 80 యేండ్లు పూర్తయిన సందర్భంగా జపాన్ యుద్ధకాల దురాక్రమణలకు వ్యతిరేకంగా చైనా పోరాటాన్ని స్మరించుకునేందుకు బుధవారం(సెప్టెంబర్ 3) బీజింగ్‌లో భారీ సైనిక కవాతు నిర్వహిస్తోంది చైనా. ఈ సైనిక కవాతులో పాల్గొనడానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లతో పాటు 26 మంది ప్రపంచ నేతలు ఈ సైనిక కవాతులో పాల్గొంటున్నారు. ఈ కవాతులో ముగ్గురు కమ్యూనిస్టు యోధులు చాలా రోజులు ఒక స్క్రీమ్ మీద కనిపించడం హైలైట్ అయితే..కిమ్ జోంగ్ ఉన్ ప్రయాణించిన ప్రయాణించిన బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్ మరో హైలైట్ గా నిలిచింది. 

చైనా ప్రధాన సైనిక కవాతులో పాల్గొనడానికి కిమ్ జోంగ్ ఉన్ తన ప్రత్యేక ప్రైవేట్ బుల్లెట్ ప్రూఫ్ రైలులో స్టైల్‌గా వచ్చారు. తాయాంగ్-హో(సన్ ట్రైన్) అని కూడా పిలువబడే ఈ రైలు ఎందుకు ప్రత్యేకమైనది.

కిమ్ జోంగ్ ఉన్ తన ఆలివ్ గ్రీన్ (మిలిటరీ గ్రీన్) బుల్లెట్ ప్రూఫ్ రైలులో చైనాకు చేరుకున్నాడు. ఇది రాజవంశ సంప్రదాయానికి అనుగుణంగా బంగారు గీతతో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. 

2011లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఉత్తర కొరియా అధ్యక్షుడు దక్షిణ కొరియాతో సహా తొమ్మిది అంతర్జాతీయ పర్యటనలు చేసారు.తన బుల్లెట్ ప్రూఫ్ రైలును చాలా వరకు ఉపయోగించారు. 

వెనుక కథ 

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ బుల్లెట్ ప్రూఫ్ రైలు వెనక పెద్ద కథే ఉంది. అతని తండ్రి కిమ్ జోంగ్ II కాలం నాటిది ఈ రైలు. కిమ్ జోంగ్ II విమాన ప్రయాణానికి భయపడేవాడట.రష్యా ,చైనాలకు పరిమిత ప్రయాణానికి రైలును ఉపయోగించాడట. 

తాజా చైనా పర్యటన లో కిమ్ జోంగ్ ఉన్ ల్యాప్‌టాప్, ఆష్‌ట్రే, ప్రింటర్, ల్యాంప్ ,టెలిఫోన్‌లతో కూడిన చెక్క డెస్క్ దగ్గర కూర్చుని కనిపించాడు.రై లు కోచ్‌కు జాతీయ జెండా ,వెల్వెట్ కర్టెన్లు అమర్చబడి ఉన్నాయి.

తరచుగా చక్రాలపై కోట అని పిలువబడే కిమ్ జోంగ్ ఉన్ బుల్లెట్ ప్రూఫ్ రైలు పేలుడు పదార్థాలు లేదా పేలుళ్ల నుంచి రక్షించేందుకు బలంగా ఉండే కిటికీలు, గోడలు,కంపార్టుమెంట్లను కలిగి ఉంది. 

ఇది ఫిరంగి గుండ్లు,ఇతర ప్రాణాంతక పేలుడు దాడులను తట్టుకోగలదు.

ఈ రైలుకు 90 కోచ్‌లు ఉన్నాయి. ఇవి దాదాపు ఏదైనా సైనిక దాడిని తట్టుకునేలా రూపొందించారు. పెద్ద దాడుల నుండి రక్షించేందుకు రైలులో యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ ఆయుధాలు కూడా ఉంటాయి.

రాడార్-గైడెడ్ తుపాకులు, ఉపరితలం నుంచి గగనతలానికి క్షిపణి లాంచర్లు ,అత్యవసర తప్పించుకునేందుకు ఒక హెలికాప్టర్ వంటి రక్షణ వ్యవస్థలు కూడా ఉన్నాయట. 

ఈ క్యారేజీలలో కాన్ఫరెన్స్ గదులు, బెడ్‌రూమ్‌లు,శాటిలైట్ ఫోన్లు కూడా ఉన్నాయి. విమానంలా కాకుండా ఈ రైలు పెద్ద సంఖ్యలో సహాయకులు, వస్తువులు లేదా వాహనాలను కూడా తీసుకెళ్లగలదు, ఇది కిమ్ ప్రయాణ అవసరాలకు చాలా నమ్మదగినదిగా ఉందట.

రోజువారీ నిత్యావసరాలు, లైవ్ లాబ్‌స్టర్, ఫ్రెంచ్ వైన్ వంటి వంటకాలు ,డ్యాన్సర్లతో ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్ లు కూడా నిర్వహిస్తారట. 

నివేదికల ప్రకారం..కిమ్ రైలు కదలికలను సులభతరం చేయడానికి ఉత్తర కొరియాలోని సుమారు 20 స్టేషన్లను సవరించారు. చక్రాలపై కవచం గంటకు గరిష్టంగా 35 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఆ వేగంతో, చైనాకు 800 మైళ్ల ప్రయాణం దాదాపు 20 గంటలు పట్టిందట. 

గతంలో ఈ రైలు కిమ్ జోంగ్ ఉన్ ప్రయాణం.. 

2023లో రష్యా పర్యటన సందర్భంగా కిమ్ ఇదే రైలును ఉపయోగించారు.10 పగళ్లు, 9 రాత్రులు ప్రయాణించారట. 

దీనికి ముందు ఏప్రిల్ 2019లో కిమ్ వ్లాదిమిర్ పుతిన్‌ను కలవడానికి రష్యా నగరమైన వ్లాదివోస్టాక్‌కు వెళ్లారు.

అదే సంవత్సరం డోనాల్డ్ ట్రంప్‌ను కలవడానికి కిమ్ అదే రైలులో 60 గంటలకు పైగా వియత్నాంలోని హనోయ్‌కు ప్రయాణించారు. అయితే ఆ శిఖరాగ్ర సమావేశం ఫలితాలను ఇవ్వలేకపోయింది.

గతంలో కిమ్ జోంగ్ ఉన్ నాలుగుసార్లు చైనాకు ప్రయాణించారు..వాటిలో రెండు మార్చి 2018 ,జనవరి 2019లో రైలులో ప్రయాణించారు.

తన తండ్రిలా కాకుండా కిమ్ జోంగ్ ఉన్ విమాన ప్రయాణం చేయడానికి పూర్తిగా వెనుకాడడు.అయితే అతను 2018 నుంచి విమానం ఎక్కలేకపోవడం గమనార్హం.