తాగిన మత్తులో ఫ్రెండ్‌ని చంపిన మిగతా ఫ్రెండ్స్

తాగిన మత్తులో ఫ్రెండ్‌ని చంపిన మిగతా ఫ్రెండ్స్

తాగిన మైకంలో ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన మేడ్చల్ జిల్లా గండిమైసమ్మలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకు చెందిన శివ (43) సంవత్సరం క్రితం నగరానికి వచ్చి వివిధ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. గండిమైసమ్మలో 15రోజుల క్రితం ఓ ప్లాట్‌కి వాచ్‌మెన్‌గా చేరి.. అక్కడే ఓ గదిలో ఉంటున్నాడు. అయితే ఏమైందో ఏమోగానీ ఆదివారం ఉదయం శివ శవమై కనిపించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. శనివారం రాత్రి శివ తన స్నేహితులతో కలిసి గదిలో మద్యం తాగినట్లు గుర్తించారు. అయితే తాగిన మైకంలో ఏదైనా వాదన జరిగి అతని స్నేహితులే శివను చంపి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శివను తల పగులగొట్టి హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

పాత వంద నోట్ల రద్దులో నిజమెంత?

కరీంనగర్‌లో ఉద్రిక్తత.. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

పులిని వండుకుతిన్న వేటగాళ్లు..