గన్‌‌‌‌తో బెదిరించి మహిళపై గ్యాంగ్ రేప్

V6 Velugu Posted on Oct 12, 2021

నోయిడా(యూపీ): ఉత్తరప్రదేశ్‌‌‌‌లో నోయిడాకు దగ్గర్లోని జెవర్ ఏరియాలో ఓ దళిత మహిళపై నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్​కు పాల్పడ్డారు. జెవర్ గ్రామం వద్ద ఆదివారం ఉదయం పొలాల్లో ఈ దారుణం జరిగిందని, నలుగురు నిందితుల కోసం స్పెషల్ టీంలతో గాలింపు చేపట్టామని పోలీసులు సోమవారం చెప్పారు. ‘‘బాధిత మహిళ పొలంలో గడ్డి కోసేందుకు వెళ్లగా, అదే ఊరికి చెందిన ఓ వ్యక్తి పశువులను మేపేందుకు వెళ్లాడు. ఇద్దరూ ఒకరికి ఒకరు తెలిసినవాళ్లే. డ్రగ్స్ కు అడిక్ట్ అయిన ఆ వ్యక్తి మహిళను పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు” అని పోలీసులు చెప్పారు. అయితే అతను గన్ తో బెదిరించి, ఆమెపై అఘాయిత్యం చేశాడని లోకల్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో మిగతా వాళ్ల పాత్రపై విచారణలో తేలుతుందని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలింపు కొనసాగిస్తున్నామని, ప్రధాన నిందితుడిని పట్టుకున్నాకే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.

Tagged woman, GANG RAPE, Uttar Pradesh, gun

Latest Videos

Subscribe Now

More News