ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి : రత్నాకర్ ఝా

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి : రత్నాకర్ ఝా

ములుగు, వెలుగు: జిల్లాలో ఈ నెల 30న  ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల టీంలు చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లకు ఎన్నికల సాధారణ పరిశీలకులు రత్నాకర్​ ఝా అధికారులకు ఆదేశించారు. వెంకటాపూర్​ మండలం పాలంపేట వద్ద ఏర్పాటు చేసిన చెక్​ పోస్టును ఆదివారం ఆయన పరిశీలించారు. నోడల్​ టీం సభ్యులు నిబంధనల ప్రకారం పనిచేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఎన్నికలలో విద్వేష ప్రసంగాలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన, అక్రమ డబ్బూ, మద్యం పంపిణీ, ఇతర ఉల్లంఘనలపై సి- విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని చెప్పారు. కాగా కలెక్టరేట్ లో  వివిధ పొలిటికల్​ లీడర్లతో  కలెక్టర్ ఇలా త్రిపాఠి  సమావేశం నిర్వహించారు.    జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవనంలో పోస్టల్ బ్యాలెట్ బూత్ ఏర్పాటు చేశామన్నారు.

పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే వారు 12 రకాల ఫోటో గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించినా  ఓటు హక్కు కల్పిస్తున్నామని తెలిపారు.  కార్యక్రమంలో ఆర్డీవో సత్యపాల్​ రెడ్డి, తహసీల్దార్​ విజయ్​ భాస్కర్​, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఆఫీసర్లు పాల్గొన్నారు .