
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గద్దె దిగాలని నిరసనలు ఊపందుకున్నాయి. ఇమ్రాన్ సర్కారుపై ప్రజలు భగ్గుమంటున్నారు. ఆయనకు వ్యతిరేకంగా భారీ స్థాయిలో నిరసనలు, ర్యాలీలు చేపడుతున్నారు. దేశాన్ని నాశనం చేశాడంటూ ఇమ్రాన్ పనితీరుపై ప్రతిపక్షాలు, కార్మికులు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. నిత్యావసరాలు, గ్యాస్, విద్యుత్ ధరలు భారీగా పెరిగాయని.. ఇమ్రాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లాహోర్‌లో ప్రజలు, సెక్యూరిటీ ఫోర్సెస్ మధ్య ఘర్షణలు చెలరేగాయి. పోలీసులు నిరసనకారులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. అనేక మంది గాయాల పాలయ్యారు.