
న్యూఢిల్లీ: మనదేశంలోని ఎనిమిది కీలక మౌలిక రంగాల వృద్ధి గత నెల మూడు శాతంగా నమోదయిందని కేంద్రం తెలిపింది. అంతకుముందు నెలలో ఈ కోర్ సెక్టార్ల ఉత్పత్తి వృద్ధి 6.5 శాతంగా ఉంది.
గత సెప్టెంబర్లో ఇది 2.4 శాతంగా నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–-సెప్టెంబర్ మధ్య కాలంలో ఎనిమిది మౌలిక రంగాల వృద్ధి 2.9 శాతంగా ఉంది. గత సంవత్సరం ఇదే కాలంలో నమోదైన 4.3 శాతం వృద్ధితో పోలిస్తే ఇది తక్కువ.