సత్తుపల్లిలో వంద పడకల ఆస్పత్రి

సత్తుపల్లిలో వంద పడకల ఆస్పత్రి

సత్తుపల్లి లో 34 కోట్ల రూపాయల వ్యయంతో 100 పడకల హాస్పిటల్ నిర్మాణం చేపడతామన్నారు మంత్రి హరీశ్ రావు. భవన నిర్మాణానికి ఇవాళ సత్తుపల్లిలో శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ  సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ 29 కోట్లతో హాస్పటల్ భవన నిర్మాణం చేస్తున్నామని తెలిపారు.  5 కోట్లతో వైద్య పరికరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రూ. 1 కోటి 25 లక్షలతో డయాగ్నొస్టిక్ సెంటర్,1 కోటి 98 లక్షలతో రేడియాలజీ ల్యాబ్ ను సత్తుపల్లి లో ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ తరువాత ఒక్క ఖమ్మంలోనే క్యాథ్ ల్యాబ్ ను ఏర్పాటు చేశామన్నారు.  త్వరలోనే పెనుబల్లి, కల్లూరు హాస్పటల్స్ కు నూతన భవనాలు వస్తాయన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.  

వైద్య,ఆరోగ్య శాఖ పై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. కేసీఆర్ కిట్లు వచ్చిన తరువాత ప్రభుత్వ హాస్పిటల్స్ లో డెలివరీలు 58 శాతం పెరిగాయన్నారు. గతంలో డయాలసిస్ వ్యాధి గ్రస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కునే వారన్నారు. అదనంగా 5 డయాలసిస్ మిషన్ లను సత్తుపల్లి హాస్పటల్ కు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు హరీశ్ రావు. సింగిల్ యూజ్ ఫిల్టర్ ను ఉపయోగించి డయాలసిస్ రోగులకు చికిత్స అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా రాష్ట్రమన్నారు. భారత దేశంలో ఎక్కడ లేని పథకం కల్యాణ లక్ష్మి పథకమన్నారు మంత్రి హరీశ్ రావు. కల్యాణ లక్ష్మి పథకం కింద రాష్ట్రంలో 10లక్షల పెళ్ళిళ్ళు జరిగాయన్నారు.  సంక్షేమానికి చిరునామాగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిలుస్తుందన్నారు.  అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు.  ప్రభుత్వ సూచనలను పాటిస్తూ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలన్నారు. ప్రజల సహకారం ఉంటే త్వరలోనే కరోనా వేవ్ నుండి బయట పడవచ్చన్నారు హరీశ్ రావు.  వ్యాక్సినేషన్ లో ఖమ్మం జిల్లా రెండవ స్థానంలో ఉందన్నారు. 

ఇవి కూడా చదవండి: 

వణికిస్తున్న చలి పులి

ల‌క్కీ డ్రా పేరుతో ల‌క్ష‌లు మోసం