వరంగల్ రెవెన్యూ అధికారులపై హైకోర్టు సీరియస్

వరంగల్ రెవెన్యూ అధికారులపై హైకోర్టు సీరియస్

వరంగల్లో రైతులకు పరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ అధికారులపై హైకోర్టు సీరియస్ అయ్యింది. వరంగల్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఆఫీసు ఆస్తులు జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలోని టెక్స్ టైల్స్ పార్క్ కు రైతులు భూమి ఇచ్చారు. అయితే పరిహారం ఇవ్వడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో హైకోర్టును ఆశ్రయించారు భూ నిర్వాసితులు. దీంతో అధికారుల నిర్లక్ష్యం వహించినందుకు 2 కోట్ల 40 లక్షలు రూపాయలు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో RDO ఆఫీసుకు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది వచ్చారు. భూ నిర్వాసితులకు పరిహారం ఇచ్చేందుకు తమకు కొంత టైం కావాలని అధికారులు కోరడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.