విజయ్ సేతుపతి దేశాన్ని అవమానించాడు

విజయ్ సేతుపతి దేశాన్ని అవమానించాడు

చెన్నై: ప్రముఖ దక్షిణాది నటుడు విజయ్ సేతుపతిని కాలితో తంతే రూ.1,001 బహుమానంగా ఇస్తామని ఓ సంస్థ ట్విట్టర్‌లో ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది. స్వాతంత్ర్య సమరయోధుడు దేవతిరు పసుంపోన్ ముత్తురామలింగ తేవర్ అయ్యను విజయ్ సేతుపతి అవమానించాడని.. అందుకు క్షమాపణలు చెప్పాల్సిందేనని ఇందూ మక్కల్ కట్చి ఫౌండర్ అర్జున్ సంపత్ డిమాండ్ చేశారు.  సేతుపతి సారీ చెప్పేవరకు ఆయన్ను ఎవరైతే తంతారో వారికి రూ.1,001 క్యాష్ ప్రైజ్ ఇస్తామని ట్విట్టర్‌లో వెల్లడించారు. కాగా, గత వారం బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌‌లో తన టీమ్‌తో కలసి వెళ్తున్న విజయ్ సేతుపతిపై ఓ గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. విజయ్‌ను వెనక నుంచి తన్నాడు. దీంతో కంగుతిన్న సేతుపతి.. ఈ విషయంపై స్పందించడానికి నిరాకరించారు.

ఇకపోతే, బెంగళూరులో విజయ్ సేతుపతి మీద దాడి చేసిన మహా గాంధీ అనే వ్యక్తితో తాను మాట్లాడానని అర్జున్ సంపత్ తెలిపారు. నేషనల్ అవార్డు గెల్చుకున్న సేతుపతిని అభినందించడానికి మహా గాంధీ కలిశాడని.. కానీ అతడితో విజయ్ వ్యంగ్యంగా మాట్లాడాడని అర్జున్ సంపత్ చెప్పారు. ‘విష్ చేయడానికి వెళ్లిన మహా గాంధీతో విజయ్ సేతుపతితో వ్యంగ్యంగా మాట్లాడాడు. ఇది అసలు దేశమే కాదన్నాడు. అయినా సరే, ముత్తురామలింగ తేవర్ పూజకు రావాల్సిందిగా సేతుపతిని మహా గాంధీ ఆహ్వానించాడు. కానీ సేతుపతి మళ్లీ వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. ఈ ప్రపంచంలో జీసస్ ఒక్కడే దేవుడని జవాబిచ్చాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ముత్తురామలింగతోపాటు ఈ  దేశాన్ని సేతుపతి అవమానించాడు’ అని ఓ జాతీయ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్జున్ సంపత్ చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం: 

బ్రాహ్మణులు, వైశ్యులు నా రెండు జేబుల్లో ఉన్నారు

అమిత్ షా జీ.. మా మంత్రులకు హిందీ రాదు

ఢిల్లీలో ధర్నా చేస్తే కేంద్రం భయపడదు