హిందీ రాదంటూ అమిత్ షాకు మిజోరం సీఎం లేఖ

హిందీ రాదంటూ అమిత్ షాకు మిజోరం సీఎం లేఖ

గౌహతి: కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు మిజోరం సీఎం పూ జొరమ్‌తంగ రాసిన ఓ లేఖ చర్చనీయాంశంగా మారింది. తమ క్యాబినెట్‌లోని మంత్రులకు హిందీ రాదని.. రాష్ట్రానికి కొత్త సీఎస్‌గా స్థానిక భాష మిజో వచ్చే వారినే నియమించాలని జొరమ్‌తంగ కోరడం హాట్ టాపిక్‌గా మారింది. అక్టోబర్ 29న కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఆయన రాసిన లేఖలోని విషయాలు ఆసక్తిని సంతరించుకున్నాయి. రీసెంట్‌గా రిటైర్ అయిన చీఫ్ సెక్రటరీ లల్నున్మావియా చౌగో స్థానంలో తన ప్రస్తుత అడిషనల్ చీఫ్ సెక్రటరీ జేసీ రామ్‌తంగ (మణిపూర్ క్యాడర్)ను చీఫ్ సెక్రటరీగా నియమించాలని ఆ లేఖలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు జొరమ్‌తంగ విజ్ఞప్తి చేశారు. 

కొందురు మంత్రులకు ఇంగ్లీష్ కూడా రాదు

‘మిజోరంలో చాలా మందికి హిందీ అర్థం కాదు. నా కేబినెట్ మినిస్టర్లలో ఎవరికీ హిందీ రాదు. వారిలో కొందరికి ఇంగ్లీష్ భాష కూడా సరిగ్గా రాదు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త చీఫ్ సెక్రటరీకి మిజో భాష రాకుంటే కష్టమవుతుంది. ప్రభావవంతంగా పని చేయడం కుదరదు. ఈ సమస్యను మేం చాన్నాళ్లుగా ఎదుర్కొంటున్నాం. మిజోరం రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నా.. ఎన్డీయే సర్కార్ అధికారంలో ఉన్నా ఈ సమస్య వస్తూనే ఉంది. దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యే వారి విషయంలో స్థానిక భాష తెలియకపోతే వారికి పోస్టింగ్ ఇవ్వరు’ అని ఆ లేఖలో జొరమ్‌తంగ అన్నారు. కాగా, జొరమ్‌తంగ విజ్ఞప్తిని తోసిపుచ్చిన కేంద్రం.. సీనియర్ ఐఏఎస్ రేణు శర్మను మణిపూర్ కొత్త చీఫ్ సెక్రటరీగా నియమించింది. నవంబర్ 1న రేణు శర్మ బాధ్యతలు తీసుకున్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

బ్రాహ్మణులు, వైశ్యులు నా రెండు జేబుల్లో ఉన్నారు

ఢిల్లీలో ధర్నా చేస్తే కేంద్రం భయపడదు

నిద్ర కోసం ఇంట్లోనే గంజాయి మొక్క