వాల్నట్స్ ఎలా తినాలంటే.. 

వాల్నట్స్ ఎలా తినాలంటే.. 

బ్లాక్ వాల్నట్స్లోని అన్శాచ్యురేటెడ్ ఫ్యాట్స్  ఆకలిని కంట్రోల్ చేస్తాయి.   వీటివల్ల కొంచెం తిన్నా కడుపునిండినట్టు అనిపిస్తుంది. దాంతో బరువు తగ్గొచ్చు. ఒమెగా–3 ఆల్ఫా–  లినోలెనిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది ఈ వాల్నట్స్లో. ఇవి గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. అలాగే వీటిలోని ఎల్లాజిక్ యాసిడ్ కార్డియో జబ్బుల నుంచి  కాపాడుతుంది. 
బ్లాక్ వాల్నట్స్ ఆకులు,  ఆయిల్ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి మెటబాలిక్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. 
బ్లాక్ వాల్నట్స్ లో  క్వెర్సెటిన్– 3– ఓ– గ్లూకోసైడ్ అనే  బయో యాక్టివ్ కాంపౌండ్ ఉంటుంది. అది యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీగా పనిచేసి బ్లడ్ షుగర్ లెవల్స్ని కంట్రోల్ చేస్తుంది. వీటిలోని మెలటోనిన్ యాంటీ ఆక్సిడెంట్ కంటినిండా నిద్రపట్టేలా చేస్తుంది. 

బ్లాక్ వాల్నట్స్ని  యాంటీ–ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ యాక్నె, మొటిమల నుంచి స్కిన్ని కాపాడతాయి. ఇన్ఫెక్షన్లని దరిచేరనివ్వవు. అయితే ఈ లాభాలన్నీ వాల్నట్స్ని సరైన పద్ధతిలో తింటేనే.  వీటిని నానబెట్టుకుని లేదా   రైస్ పుడ్డింగ్ చేసుకుని మాత్రమే తినాలి.
రైస్ పుడ్డింగ్ రెసిపీ
రెండు కప్పుల పాలని సన్నటి మంటపై మరిగించాలి. కాస్త దగ్గరపడ్డాక  అరకప్పు చక్కెర వేసి రెండు నుంచి మూడు నిమిషాలు  వేడిచేయాలి. ఆ తర్వాత  శుభ్రంగా కడిగిన పావుకప్పు నూకలు వేసి  25 నిమిషాలు కలుపుతూ మగ్గించాలి. చివరిగా అర టీ  స్పూన్ బ్లాక్ వాల్నట్స్ పౌడర్ వేసి స్టవ్ ఆపేయాలి. మిశ్రమం పూర్తిగా చల్లారాక  కాసేపు ఫ్రిజ్లో పెట్టి తింటే చల్లగా మనకి ఎన్నో పోషకాలను అందిస్తుంది.