కలకలం: ఆపరేషన్ చేస్తూ డాక్టర్ల టిక్ టాక్ వీడియోలు

కలకలం: ఆపరేషన్ చేస్తూ డాక్టర్ల టిక్ టాక్ వీడియోలు

డాక్టర్లు ఆపరేషన్ చేస్తూ టిక్ టాక్ చేయడం కలకలం రేపుతుంది. తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రానిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వాసుపత్రి వైద్యులు  టిక్ టాక్ చేసిన ఆపరేషన్ వీడియోలు వైరల్ గా మారాయి. హుజురాబాద్ ఆర్ఎంవో డాక్టర్ శ్రీకాంత్, అతని వైద్య బృందం టిక్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఆ వైరల్ వీడియోలపై ఆర్ఎంవో డాక్టర్ శ్రీకాంత్ స్పందించారు. ఎవరో కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను ఎంతో నిబద్ధతతో పనిచేసే వ్యక్తినని, ఆపరేషన్ చేసే సమయంలో ఫ్రూఫ్ కోసం, మీడియాకు అందించేందుకు ఆపరేషన్ చేసే వీడియోలు తీస్తామన్నారు. కావాలనే ఎవరో ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఆపరేషన్ థియేటర్ లోని వీడియోలతో టిక్ టాక్ చేశారన్నారు. తాను తప్పు చేశానని రుజువైతే  శిక్ష అనుభవించేందుకు సిద్ధంగా ఉన్నానని డాక్టర్ శ్రీకాంత్ మీడియాకు తెలిపారు.