నోటాకు ఓటేసినా బాధపడం..

నోటాకు ఓటేసినా బాధపడం..

టీఆర్ఎస్​కు ఓటేస్తే సంతోషిస్తం

బిల్డర్స్​ ఫెడరేషన్​ మీటింగ్​లో కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: జీహెచ్‌‌‌‌ఎంసీ ఎలక్షన్లలో ఏ పార్టీకి ఓటేశామనేది ముఖ్యం కాదని, ఓటింగ్‌‌‌‌లో పాల్గొనడం చాలా కీలకమని మంత్రి కేటీఆర్​ అన్నారు. టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు ఓటేస్తే సంతోషిస్తామని.. నోటాకు ఓటు వేసినా బాధపడబోమని చెప్పారు. గ్రామాల్లో 80–90 శాతం ఓటింగ్ జరుగుతుంటే.. హైదరాబాద్‌‌‌‌లో 40–45 శాతం కూడా ఓటేయడం లేదన్నారు. కొందరు నేతలను ఎన్నుకోవడంలో పాలుపంచుకోకపోయినా.. తిట్టడంలో ముందుంటారని కామెంట్​ చేశారు. రానున్న నాలుగైదు రోజులు చాలా ముఖ్యమని.. ఓట్లు వేసేటప్పుడు ఫ్రెండ్స్‌‌‌‌, ఫ్యామిలీతో చర్చించి ఓట్లు వేయాలని సూచించారు.  మూడేండ్లలో హైదరాబాద్  గ్లోబల్ సిటీగా మారుతుందని చెప్పారు. సోమవారం తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్​ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎస్ఆర్​డీపీ పనులు చేపట్టామని.. ట్రాఫిక్ రహిత రోడ్లు లక్ష్యంగా పనులు చేస్తున్నామని తెలిపారు.

ఆక్రమణలన్నీ కూల్చివేస్తం

కొత్త రెవెన్యూ చట్టం, టీఎస్ బీపాస్ తో అవినీతి రహిత సేవలు అందుతాయని కేటీఆర్​ అన్నారు. నాలాల ఆక్రమణల కారణంగా ఇటీవలి వానలకు వరదలు వచ్చాయని.. కొత్త జీహెచ్ఎంసీ చట్టంతో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. అనధికార నిర్మాణాలన్నీ కూల్చివేసేలా చట్ట సవరణ చేస్తున్నామన్నారు. 20 వేల కోట్లతో స్ట్రాటజిక్ నాలా డెవలప్ మెంట్ ప్లాన్ అమలు చేస్తామని తెలిపారు. ఆరేండ్లలో వాటర్‌‌‌‌‌‌‌‌, కరెంట్‌‌‌‌, శానిటేషన్ లో హైదరాబాద్‌‌‌‌ ఎంతో మెరుగుపడిందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు వేరే పార్టీలకు లేదని, సిటీని అన్ని విధాలుగా డెవలప్​ చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని కేటీఆర్​ చెప్పారు. తర్వాత బిల్డర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు మాట్లాడారు. కొత్త రెవెన్యూ చట్టం బిల్డర్లు, సామాన్యుల మన్ననలు పొందుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సాహించేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయన్నారు.

మా సమస్యలు తీర్చాలె

ధరణి, ఈ-పాస్‌‌‌‌, కొత్త రెవెన్యూ చట్టాలను స్వాగతించిన టీబీఎఫ్‌‌‌‌ కొన్ని సమస్యలను మంత్రి కేటీఆర్​కు వివరించింది. ఎల్‌‌‌‌ఎర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌పై కొంత గందరగోళం నెలకొందని పేర్కొంది. ట్రాన్స్‌‌‌‌ఫార్మర్ల సప్లయ్‌‌‌‌లో షార్టేజ్‌‌‌‌ ఉందని, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల ఇష్యూలో ఆలస్యం జరుగుతోందని, కస్టమర్లకు వాటర్‌‌‌‌‌‌‌‌ కనెక్షన్లు ఇవ్వడం కష్టమవుతోందని వివరించింది. గతంలో బిల్డింగ్‌‌‌‌ నిర్మాణ సమయంలోనే కమర్షియల్‌‌‌‌ కరెంట్​ కనెక్షన్‌‌‌‌ను ఇచ్చేవారని, ఇప్పుడు టెంపరరీ కనెక్షన్లు ఇస్తుండటంతో.. బిల్లు ఎక్కువగా వస్తోందని వాపోయింది. ఈ అంశాలపై ఎలక్షన్ల తర్వాత చర్చించి, పరిష్కార మార్గాలు చూస్తామని కేటీఆర్​ హామీ ఇచ్చారు.

for more News…

ఎలక్షన్లు రాంగనే… ఓటర్లపై ప్రేమ పుట్టె

పేరుకే మహిళా కార్పొరేటర్లు.. పెత్తనమంతా భర్తలదే

ఎన్నికల్లో మేమంతా నోటాకే ఓటేస్తం

ప్రాజెక్టు ఏదైనా.. పేదల భూముల్లే లాక్కుంటున్నారు