హోటల్ వద్దు, ఎంబసీలో ఉంటా: ఇమ్రాన్ ఖాన్

హోటల్ వద్దు, ఎంబసీలో ఉంటా: ఇమ్రాన్ ఖాన్

దేశం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని పొదుపు చర్యలు పాటించాలని ప్రకటించిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దాన్ని ఆచరణలోనూ చూపిస్తున్నారు. ఈ నెల 21 నుంచి మూడురోజుల పర్యటన కోసం యూఎస్ వెళ్లనున్న ఆయన ఖరీదైన హోటళ్లలో దిగకూడదని, వాషింగ్టన్ లోని పాకిస్థాన్ రాయబారి నివాసంలో బస చేయాలని ఆ నిర్ణయించుకున్నారు. గత ఏడాది ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్ ఖాన్ పొదుపు చర్యలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. పాకిస్థాన్ ను ఆదుకునేందుకు 6 బిలియన్ డాలర్ల  బెయిల్ ఔట్ ప్యాకేజీకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గతవారం ఆమోదం తెలిపింది. పొదుపు చర్యలు పాటించాలని కండిషన్ పెట్టింది.