అక్కడంతే : మీ ఇల్లు శుభ్రం లేకపోతే ప్రభుత్వం ఫైన్ వేస్తుంది

అక్కడంతే : మీ ఇల్లు శుభ్రం లేకపోతే ప్రభుత్వం ఫైన్ వేస్తుంది

చైనాలోని ఒక కౌంటీ ప్రభుత్వం స్థానికులలో పరిశుభ్రత అలవాట్లను ప్రారంభించడానికి కొన్ని కఠిన చర్యలు తీసుకుంది. ఈ ప్రభుత్వాన్ని నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో పుగే కౌంటీ అని పిలుస్తారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, తమ వంట గదులను శుభ్రం చేయకుండా వదిలివేసే వ్యక్తులపై 10 యువాన్లు అంటే రూ. 116 జరిమానా విధించబడుతుంది. ఈ పెనాల్టీ తమ బెడ్ రూం, ఇంటి పనులను పూర్తి చేయని వ్యక్తులకు కూడా వర్తిస్తుంది. ఇది మాత్రమే కాదు, భోజనం చేసేటప్పుడు పరిశుభ్రంగా ఉండని వ్యక్తులపై 20-యువాన్లు అంటే రూ.233 జరిమానా విధించబడుతుంది. అంతే కాకుండా ఇంటి ప్రాంగణంలో చిందరవందరగా లేదా ఎలాంటి చెత్త వేయకుండా జాగ్రత్త వహించాలి. దీని తీవ్రతను బట్టి రూ. 35 నుండి జరిమానా విధించవచ్చు.

ప్యూజ్ కౌంటీ ప్రారంభించిన ఈ కొత్త విధానానికి Fine Standards for the New Countryside for Human Settlement Environment అనే పేరు పెట్టారు. ఇది జీవన పరిస్థితులను మెరుగుపరచడం, జరిమానాలకు లోబడి ఉండే 14 వర్గాల ప్రవర్తనను వివరించడం లక్ష్యంగా పెట్టుకుంది. అంతే కాదు ఒకవేళ పదేపదే నేరాలు చేస్తే జరిమానాలు రెట్టింపు అవుతాయని ఓ నోటీసులో కూడా స్పష్టంగా తెలిపింది.

నవంబర్ 14న సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్‌తో ఈ పాలసీకి సంబంధించి గ్రామ వైస్ డైరెక్టర్ ఒక మాట చెప్పారు.  అతని ప్రకారం, మురికి, గజిబిజి, అస్తవ్యస్తమైన జీవన పరిస్థితులు అనేటువంటి సమస్యను పరిష్కరించడం లక్ష్యం. మీరు ఒక రైతు ఇంటిని సందర్శిస్తే.. అక్కడి పర్యావరణం అపరిశుభ్రంగా, గజిబిజిగా ఉంటుంది.. కావున ఈ జరిమానాలు సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించలేవని కూడా ఆయన అన్నారు. ధూళిని వ్యాప్తి చేసే కార్యకలాపాలను నిరుత్సాహపరిచే సాధనంగా జరిమానాలు ఉపయోగించబడుతున్నాయని ఆయన చెప్పారు. సేకరించిన డబ్బును తిరిగి పెట్టుబడి పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని వైస్ డైరెక్టర్ తెలిపారు. ఇంటికి 3 యువాన్లు జరిమానా విధించినట్లయితే, మేము వారికి చీపురు కొనుగోలు చేయగలమని చెప్పారు.