కేవలం రూ.349కే.. నాలుగు సినిమాలు చూడవచ్చు

కేవలం రూ.349కే.. నాలుగు సినిమాలు చూడవచ్చు

హైదరాబాద్, వెలుగు :  మల్టీప్లెక్స్ చెయిన్  పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్ తన నెలవారీ సినిమా సబ్‌‌స్క్రిప్షన్ సర్వీస్ పాస్‌‌పోర్ట్ రెండో ఎడిషన్‌‌ను ప్రారంభించింది.   ప్రతి సోమవారం నుంచి గురువారాల వరకు కస్టమర్లు నెలకు 4 సినిమాల వరకు కేవలం రూ.349లకే చూడవచ్చు.

పాస్‌‌పోర్ట్ ద్వారా మరొకరికి టికెట్‌‌లను కొనుగోలు చేసి రీడీమ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.  రిక్లైనర్‌‌లపై లేదా ఐమాక్స్​ స్క్రీన్​, ఎంఎక్స్​4డీ,4డీఎక్స్​ ఫార్మాట్లలో సినిమాలను చూడాలంటే కుంటే,  పాస్‌‌పోర్ట్ కూపన్‌‌పై అదనంగా రూ. 150 చెల్లించాలి.