సంప్రదాయ విమాన ఇంధనం(ఏటీఎఫ్) వల్ల కలిగే ఉద్గారాలను తగ్గించేందుకు భారత ప్రభుత్వం, దేశీయ చమురు కంపెనీలు సుస్థిర విమాన ఇంధనం (ఎస్ఏఎఫ్) ఉత్పత్తిపై దృష్టి సారించాయి. పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ (ఈ20) కలపడంలో సాధించిన పురోగతి స్ఫూర్తితో విమానయాన రంగంలో కూడా హరిత ఇంధనాల వాడకాన్ని తప్పనిసరి చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. వాడిన వంట నూనె నుంచి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) ఎస్ఏఎఫ్ ఉత్పత్తి చేయడానికి సిద్ధమైంది. హర్యానాలోని పారిపట్ రిఫైనరీ వద్ద ఏడాది చివరి నుంచి వార్షికంగా 35,000 టన్నుల ఎస్ఏఎఫ్ ఉత్పత్తిని ప్రారంభించనున్నది.
హోటళ్లు, రెస్టారెంట్లు, హల్దిరామ్ వంటి పెద్ద స్నాక్స్ తయారీ సంస్థల నుంచి ఏజెన్సీలు వాడిన వంట నూనెను సేకరించి పానిపట్ రిఫైనరీకి సరఫరా చేస్తాయి.
దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 2025, జనవరి– సెప్టెంబర్ మధ్య 118.45 మిలియన్లకు చేరింది. ఇది 2024 ఇదేకాలంతో పోలిస్తే 64.2 శాతం పెరుగుదలను సూచిస్తుంది. ఈ పెరుగుదల, ఉద్గారాలను తగ్గించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతోంది.
తప్పనిసరిగా ఎస్ఏఎఫ్బ్లెండింగ్ లక్ష్యాలు
భారత ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం
అంతర్జాతీయ విమానాలు (భారత్ నుంచి)
2027: 1 శాతం ఎస్ఏఎఫ్ బ్లెండింగ్
2028: 2 శాతం ఎస్ఏఎఫ్ బ్లెండింగ్
2030: 5 శాతం ఎస్ఎఫ్ఎఫ్ బ్లెండింగ్.
దేశీయ విమానాలు
2030: 5 శాతం ఎస్ఏఎఫ్ బ్లెండింగ్.
2040: 15 శాతం ఎస్ఏఎఫ్ బ్లెండింగ్.
