కంపెనీల్లో ఏఐపై శిక్షణ తక్కువే..జీనియస్ హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌

కంపెనీల్లో ఏఐపై శిక్షణ తక్కువే..జీనియస్ హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: భారత కార్పొరేట్ కంపెనీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం వేగంగా పెరుగుతోంది. అయినప్పటికీ ఇవి తమ  ఉద్యోగులకు సరైన శిక్షణ అందించడంలో వెనకబడ్డాయని జీనియస్ హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెక్  రిపోర్ట్  తెలిపింది. 2025 నవంబరులో 1,704 మంది ప్రొఫెషనల్స్‌‌‌‌‌‌‌‌పై సర్వే నిర్వహించింది. 

ఈ సర్వే ప్రకారం,  71శాతం మంది తమ పాత్రలు వచ్చే 2–3 సంవత్సరాల్లో ఏఐ కారణంగా మారతాయని భావించారు. అయితే 61శాతం మంది తమ సంస్థలు ఏఐ వినియోగంపై తగిన మార్గదర్శకత్వం ఇవ్వలేదని అన్నారు.  కేవలం 37శాతం మంది మాత్రమే సరైన శిక్షణ లభించిందని చెప్పారు. 

67శాతం మంది ఇప్పటికే ఏఐ టూల్స్‌‌‌‌‌‌‌‌ను రోజువారీ పనుల కోసం ఉపయోగిస్తున్నారని, 69శాతం మంది పనితీరు సులభమైందని చెప్పారని  జీనియస్ హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్ టెక్ రిపోర్ట్ వెల్లడించింది.  

25శాతం మంది  మాత్రం ఏఐతో కొత్త  సమస్యలు వచ్చాయని తెలిపారంది. ఏఐ- జనరేట్ చేసిన ఇన్‌‌‌‌‌‌‌‌సైట్స్‌‌‌‌‌‌‌‌ను నమ్ముతామని 49శాతం మంది చెప్పగా,  36శాతం మంది నమ్మమన్నారు.