రష్యా నుంచి మస్తు ఆయిల్ .. మే నెలలోనూ టాప్ సప్లయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

రష్యా నుంచి మస్తు ఆయిల్ ..  మే నెలలోనూ టాప్ సప్లయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • రష్యా నుంచి మస్తు ఆయిల్ 
  • మే నెలలోనూ టాప్ సప్లయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రికార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • దేశ ఆయిల్ దిగుమతుల్లో 42 శాతానికి రష్యన్ క్రూడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
  • మిడిల్ ఈస్ట్ నుంచి తగ్గిన ఆయిల్ దిగుమతులు

న్యూఢిల్లీ: రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతి  చేసుకోవడం నెల నెలకూ పెరుగుతోంది. ఈ ఏడాది మే లో రికార్డ్ స్థాయిలో రష్యన్ క్రూడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దిగుమతి చేసుకున్నాం. ప్రస్తుతం సౌదీ అరేబియా, ఇరాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యూఏఈ, యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నుంచి ఇంపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకుంటున్న మొత్తం ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇది సమానం కావడం విశేషం. కిందటి నెలలో రష్యా నుంచి రోజుకి 19.6 లక్షల బ్యారెళ్ల  క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  ఇండియా దిగుమతి చేసుకుంది.  అంతకు ముందు నెలలో దిగుమతి చేసుకున్న దాని కంటే ఇది 15 శాతం ఎక్కువ.

ఇండియా చేసుకుంటున్న మొత్తం ఆయిల్ దిగుమతుల్లో 42 శాతం  వాటా రష్యన్ ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దే ఉంది. ఒక దేశం నుంచి ఇంతలా ఆయిల్ దిగుమతి చేసుకోవడం ఇదే మొదటిసారి. గతంలో మిడిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎక్కువగా దిగుమతి చేసుకునే వాళ్లం. రష్య తక్కువ ధరకే ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అమ్ముతుండడంతో మిడిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈస్ట్ నుంచి చేసుకుంటున్న క్రూడ్ దిగుమతులు తగ్గిపోయాయి. సౌది అరేబియా నుంచి చేసుకుంటున్న ఆయిల్ దిగుమతులు కిందటి నెలలో రోజుకి 5,60,000 బ్యారెళ్లకు తగ్గింది.  ఫిబ్రవరి, 2021 తర్వాత ఇదే తక్కువ. ఆర్గనైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టింగ్ కంట్రీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఒపెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) నుంచి చేసుకుంటున్న దిగుమతుల ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయాయి. క్రూడాయిల్ దిగుమతుల్లో  ఒపెక్ దేశాల వాటా 39 శాతానికి దిగొచ్చింది. 

ఒకప్పుడు 90‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాతం అక్కడి నుంచే..

ఒకానొక టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా క్రూడాయిల్ దిగుమతుల్లో 90 శాతం మిడిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆఫ్రికా దేశాల నుంచే ఉండేది. రష్యా ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చౌకగా మారిన తర్వాత నుంచి ఈ దేశం నుంచి క్రూడ్ దిగుమతులు విపరీతంగా పెరిగాయి.  వరుసగా ఎనిమిదవ  నెలలోనూ ఆయిల్ దిగుమతుల్లో రష్యా  టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంది. కాగా, క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిఫైన్ చేసి పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారుస్తారు.  కిందటి నెలలో ఇరాక్ నుంచి రోజుకి  8.3 లక్షల బ్యారెళ్ల ఆయిల్ దిగుమతి చేసుకున్నాం. యూఏఈ  నుంచి రోజుకి 2,03,000 బ్యారెళ్లు, యూఎస్ నుంచి 1,38,000 బ్యారెళ్లు దిగుమతి చేసుకున్నాం. 

ఒక శాతం నుంచి 42 శాతానికి..

దేశ క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దిగుమతుల్లో రష్యా వాటా ఏడాదిన్నర క్రితం వరకు కేవలం ఒక శాతం మాత్రమే ఉండేది. కిందటేడాది మార్చిలో కేవలం రోజుకి 68,600 బ్యారెళ్లను మాత్రమే రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాం. రవాణా ఖర్చులు ఎక్కువగా ఉండడం,  క్రూడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధరలు చౌకగా లేకపోవడంతో దేశ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రష్యన్ ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక ఈ పరిస్థితులు మారిపోయాయి. వెస్ట్రన్, యూరప్ దేశాలు  రష్యా నుంచి ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొనడం తగ్గించేశాయి. దీంతో ఈ దేశానికి ఇండియా అతిపెద్ద మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, పార్టనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది. ప్రస్తుతం దేశ  దిగుమతుల్లో రష్యన్ ఆయిల్ వాటా ఏకంగా 42 శాతానికి పెరిగింది. కిందటి నెలలో ఇండియా రోజుకి 47 లక్షల బ్యారెళ్ల ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దిగుమతి చేసుకోగా,  ఒపెక్ నుంచి వచ్చిన ఆయిల్ 18 లక్షల  బ్యారెళ్లకు తగ్గింది. 

ఇరాక్ కంటే డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

2017–18  నుంచి ఇండియాకు ఆయిల్ సప్లయ్ చేస్తున్న దేశాల్లో టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొనసాగిన ఇరాక్ కంటే రష్యా నుంచి చేసుకుంటున్న దిగుమతులు రెండింతలు ఉండడం విశేషం. కిందటి నెలలో ఇరాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి రోజుకి 8.3 లక్షల బ్యారెళ్ల ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దిగుమతి చేసుకున్నాం. మనకు ఆయిల్ సప్లయ్ చేస్తున్న దేశాల్లో ఇరాక్ రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు, సౌదీ అరేబియా  మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పడిపోయాయి.  ఇండియన్ రిఫైనరీ కంపెనీలు రష్యా నుంచి  చేసుకుంటున్న క్రూడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆయిల్ దిగుమతులు మరింత పెరుగుతాయని  క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ట్రాక్ చేసే వొర్టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొంది. రష్యన్ ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై 60 డాలర్ల లిమిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వెస్ట్రన్ కంపెనీలు పెట్టిన విషయం తెలిసిందే.

ఇంత కంటే తక్కువ రేటుకు కొనే ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీలు దినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో పే చేస్తున్నాయని వొర్టెక్స్ వెల్లడించింది. కాగా, రవాణా ఛార్జీలతో కలిపి రష్యా నుంచి  చేసుకుంటున్న  క్రూడాయిల్ సగటు ధర ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్యారెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 68.21 డాలర్లుగా ఉంది. అదే సౌదీ అరేబియా నుంచి వచ్చే ఆయిల్ ధర  బ్యారెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 86.96 డాలర్లు.  ఇరాక్ ఆయిల్ ధర బ్యారెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 77.77 డాలర్లు. మే నెలలో  ధరలు ఎలా ఉన్నాయో ఇంకా డేటా బయటకు రాలేదు.