హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ గ్యాస్​ గోదాంలో తనిఖీలు

హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ గ్యాస్​ గోదాంలో తనిఖీలు

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని శివాజీనగర్​లోని రవితేజ హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ గ్యాస్​ గోదాంలో డిస్ట్రిక్ట్​ సివిల్​సప్లై ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. గోదాంలో బుక్స్​ మెయింటైన్​ చేయకపోవడం, ఖాళీ సిలిండర్లను కంపెనీకి పంపకపోవడం, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ కంపెనీవి కాకుండా ఇతర కంపెనీలకు చెందిన 24 సిలిండర్లను గోదాములో ఉంచడం, 285 హెచ్​పీ సిలిండర్లకు సంబంధించి లెక్క తేలకపోవడం, తదితర అంశాలను తనిఖీల్లో గుర్తించారు. దీంతో గ్యాస్​ ఏజెన్సీపై కేసు నమోదు  చేసినట్టు జిల్లా అధికారి ప్రేమ్​కుమార్​ తెలిపారు.