పెద్దపల్లి వంశీకృష్ణదే!..జన లోక్ పోల్ సర్వేలో వెల్లడి

పెద్దపల్లి  వంశీకృష్ణదే!..జన లోక్ పోల్ సర్వేలో వెల్లడి
  • కాకా మనుమడికే ప్రజల మద్దతు
  •  లోక్ సభ సెగ్మెంట్ లో కాంగ్రెస్ కు 43.48% ఓట్లు
  • రెండో స్థానంలో బీఆర్ఎస్.. థర్డ్ ప్లేస్ లో బీజేపీ
  •  ట్విట్టర్ లో జన లోక్ పోల్ సర్వే రిపోర్ట్

హైదరాబాద్: పెద్దపల్లి పార్లమెంటరీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి, కాకా వెంకటస్వామి మనుమడు వంశీకృష్ణ విజయం సాధించబోతున్నారని జన లోక్ పోల్ సర్వే వెల్లడించింది. తెలంగాణలోని పలు లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించిన రిపోర్ట్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తోంది. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి నియోజకవర్గాల వారీగా సర్వే నిర్వహించి నివేదికలను ట్విట్టర్ లో వెల్లడించింది. 2 శాతం ఓటర్ల శాంపిళ్లను తీసుకొని సర్వే చేసినట్టు సర్వే సంస్థ ప్రకటిచింది. ఇందులో  కాంగ్రెస్ పార్టీకి 43.48% మంది జై కొట్టారు. బీఆర్ఎస్ పార్టీకి 32.49% మంది మద్దతు పలికారు. 14.96% మంది బీజేపీకి ఓట్లు వేస్తామని చెప్పారని తెలిపింది. ఇతరులకు 9.07% మంది మద్దతు ప్రకటించినట్టు సంస్థ వివరించింది. 

అసెంబ్లీ ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్

పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని పెద్దపల్లి, మంథని, రామగుండం, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ధర్మపురి సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. ఈ ఏడు సెగ్మెంట్లలోనూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. మంథని నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన దుద్దళ్ల శ్రీధర్ బాబు ప్రస్తుతం ఐటీ మంత్రిగా ఉన్నారు.  పెద్దపల్లి ఎమ్మెల్యేగా విజయ రమణారావు, చెన్నూరు ఎమ్మెల్యేగా గడ్డం వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యేగా గడ్డం వినోద్, మంచిర్యాల నుంచి కొక్కిరాల  ప్రేంసాగర్ రావు, ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్​ కుమార్ శాసన సభ్యులుగా గెలుపొందారు. రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం  కొలువుదీరింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను అమలు చేసింది. ఈ పరిణామాలన్నీ గడ్డం వంశీకృష్ణకు కలిసివచ్చే అవకాశాలున్నాయి. 

కలిసొచ్చే కాకా బ్రాండ్

పేదల గుండెల్లో దీపమై వెలుగుతున్న నేత కాకా వెంకటస్వామి ఆయన పెద్దపల్లి ప్రాంతానికి చేసిన సేవలను ప్రజలు ఇప్పటికీ స్మరించుకుంటూ ఉంటారు. తెలంగాణ ఏర్పాటు లో ఆయన పాత్ర వెలకట్టలేనిది. కాంగ్రెస్ పార్టీని ఒప్పించడంలో కాకా కీలక  పాత్ర పోషించారు. గుడిసె వాసుల పక్షాన నిలిచిన నేతగా గడ్డం వెంకటస్వామికి పేరుంది. ఆయన మనుమడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వంశీకృష్ణ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుండటం విశేషం. కాకా కుటుంబం చేసిన సేవలు కూడా వంశీకృష్ణ గెలుపునకు దోహదపడతాయని విశ్లేషకులు అంటున్నారు. 

గ్రాఫ్​

  • కాంగ్రెస్    43.48% 
  • బీఆర్ఎస్    32.49%
  • బీజేపీ    14.96%
  • ఇతరులు    09.07%