జర్నలిస్టులు 90 రోజులకు మించి మా దేశంలో ఉండొద్దు!

జర్నలిస్టులు 90 రోజులకు మించి మా దేశంలో ఉండొద్దు!

చైనా జర్నలిస్టులకు అమెరికా రెస్ట్రిక్షన్స్

వాషింగ్టన్: చైనాపై ఒక్కటొక్కటిగా అమెరికా ఆంక్షలు పెంచుతోంది. తాజాగా చైనా జర్నలిస్టులు అమెరికాలో 90 రోజుల కంటే ఎక్కువ ఉండకూడదనే రూల్ తీసుకొచ్చింది. ఇటీవల అమలులోకి తెచ్చిన ఫెడరల్ నోటిఫికేషన్‌లో ఈ ప్రస్తావన తీసుకొచ్చింది. సాధారణంగా విదేశీ జర్నలిస్టులు అమెరికాలో 240 రోజుల వరకు ఉండొచ్చు. పరిస్థితిని బట్టి మరికొంత కాలం ఉండే అవకాశం కల్పిస్తారు. అయితే శుక్రవారం చైనా నుంచి వచ్చిన ఒక జర్నలిస్టుకు ఫెడరల్ నోటిఫికేషన్ ప్రకారం ‘ఐ’ కేటగిరీ కింద కేవలం 90 రోజులకు మాత్రమే వీసా జారీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి , చైనాతో ట్రేడ్ వార్, హాంకాంగ్ పై ఆంక్షలు వంటి అనేక అంశాల కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగజారుతున్న నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.

For More News..

చితి మీద పెట్టిన తర్వాత శవం మారిందని ఫోన్.. ఆగిన అంత్యక్రియలు

టెక్నీషియన్లకు రోజుకు రూ. 30 లక్షలు చెల్లించినా పవర్ ప్లాంట్ నడుస్తలే..

స్మార్ట్​ఫోన్​ కోసం యువతి సూసైడ్​