బెంగళూరు రెండోరోజూ కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్షాల నిరసన కొనసాగింది. సభ మొదలైన కొద్దిసేపటికే బీజేపీ సహా విపక్షాలు అసెంబ్లీలో నినాదాలు చేశాయి. బ్రేక్ తర్వాత కూడా అసెంబ్లీలో సీన్ మారకపోవడంతో… స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ అసెంబ్లీని రేపటికి వాయిదావేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి మెజారిటీ లేదని.. ప్రభుత్వంలో కూర్చునే నైతికహక్కు సీఎం కుమారస్వామి కేబినెట్ కు లేదని ప్రతిపక్ష బీజేపీ నాయకుడు యెడ్యూరప్ప అన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ మధ్య పొత్తుకు జనం మద్దతు లేదన్నారు. తమ నిరసనను రేపు శుక్రవారం కూడా కొనసాగిస్తామన్నారు.
నిన్న ఓటాన్ అకౌంట్ ను ప్రవేశపెట్టేందుకు కన్నడ అసెంబ్లీ సమావేశమైంది. గవర్నర్ వజుభాయి వాలా ప్రసంగాన్ని బీజేపీ అడ్డుకుంది. ప్రసంగంలో రెండు పేజీలు మాత్రమే చదివి గవర్నర్ వెళ్లిపోయారు. ప్రసంగ ప్రతులను సభ్యులకు పంచిన స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్.. గవర్నర్ స్పీచ్ ను టేబుల్ చేసి.. కాపీలను సభ్యులకు పంచారు.
నలుగురు కాంగ్రెస్ సభ్యులు కొద్దిరోజులుగా పార్టీ ఆదేశాలను పాటించడంలేదు. వ్యక్తిగతంగా కలిసి వివరణ ఇవ్వాలని సీఎల్పీ నాయకుడు సిద్ధరామయ్య ఆదేశించినా వారు ఇప్పటికీ ఆయనతో సమావేశం కాలేదు. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రమేశ్ జార్ కొహోలి, మహేశ్ కుమ్టహల్లి, బి.నాగేంద్ర, ఉమేష్ జాదవ్ లు అసెంబ్లీకి హాజరు కావడం లేదు.
BJP Karanataka Chief BS Yeddyurappa on Assembly adjourned till 11 am tomorrow after protest by BJP MLAs.: They (State government) have no majority and they have no moral right to stay in the government. We will continue our protest tomorrow. pic.twitter.com/UbPa5kDH5O
— ANI (@ANI) February 7, 2019

