కార్తి చిదంబరాన్ని ప్రశ్నిస్తున్న ED

కార్తి చిదంబరాన్ని ప్రశ్నిస్తున్న ED

INX మీడియా కేసులో కార్తి చిదంబరాన్ని ఈడీ ప్రశ్నిస్తోంది. మనీలాండరింగ్ విషయంలో కార్తి నుంచి ఈడీ, సమాధానాలు రాబడుతోంది. 2007లో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు FIPB అనుమతులను ఎలా పొందారన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. INX మీడియాకు పెట్టుబడుల అనుమతి విషయంలో డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలపై 2018, ఫిబ్రవరి 28న కార్తి చిదంబరం అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలైన తర్వాత ఈడీ ప్రశ్నలు సంధిస్తూ వస్తోంది. ఇప్పటికే 54 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

మరోవైపు INX మీడియా మాజీ డైరెక్టర్ ఇంద్రాణి ముఖర్జీ… ఈ కేసులో అప్రూవర్ గా మారుతానంటూ పటియాల హౌస్ కోర్టుకు తెలిపింది. ముంబై బైకుల్లా జైలులో కుమార్తె హత్య కేసులో నిందితురాలిగా ఉన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవ్వాలని కోర్టు తెలిపింది.