కేజీ టూ పీజీ ఉచిత విద్య కూడా మోసమే : వైఎస్ షర్మిల

కేజీ టూ పీజీ ఉచిత విద్య కూడా మోసమే : వైఎస్ షర్మిల

తెలంగాణలో అప్పు లేని రైతు లేడని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. వరంగల్ జిల్లా నెక్కొండ నైట్ క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన వైఎస్ షర్మిల.. ఏబీ తండాలోని కూలీలతో మాట్లాడారు. అనంతరం  పంటలు దిగుబడి, మద్దతు ధర ఎలా ఉందంటూ అడిగి తెలుసుకున్నారు. తొమ్మిదేళ్లుగా కేసీఆర్ తెలంగాణ ప్రజలను మాటలతో మోసం చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. డబుల్ బెడ్ రూం అని చెప్పి రాష్ట్రంలో పేదలను మోసం చేశారన్నారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య అనేది కూడా మోసమేనన్న షర్మిల... రాష్ర్టంలో సర్కార్ బడులు బంద్ పెట్టే పరిస్థితిలో ఉన్నాయని చెప్పారు. మూడు ఎకరాల భూమి  మోసం, పోడు పట్టాలు అని మోస అంటూ ధ్వజమెత్తారు. రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేస్తున్నారని, 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 8 ఏళ్లలో ఉద్యోగాలు లేక వందల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. బంగారు తెలంగాణ కేసీఆర్ కుటుంబానికి అయిందంటూ మండిపడ్డారు. ఒకప్పుడు స్కూటర్ లో తిరిగే కేసీఆర్.. ఇప్పుడు విమానాల్లో తిరుగుతున్నారని, ప్రజల సమస్యల కోసం మాత్రం కేసీఆర్ బయటకు రాడని విమర్శించారు. కేవలం ఓట్ల కోసం మాత్రమే బయటకు వస్తాడన్న షర్మిల.. . ఎన్నికలయ్యాక మళ్ళీ తిరిగి కూడా చూడడని ఆరోపించారు.

"ఈ సారి ఎన్నికలు ఉన్నాయి.. కేసీఆర్ మళ్ళీ వస్తాడు.. ఆకాశంలో చందమామ అంటాడు" అని షర్మిల సెటైరికల్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ సర్కార్ కూలిపోవాలని, కేసీఆర్ ఫామ్ హౌజ్ కే పరిమితం కావాలని ఆకాంక్షించారు. ప్రజల కష్టాలు చూస్తూ 3500కి.మీ. పాదయాత్ర చేశానన్న ఆమె... వైఎస్సార్ పాలనను మళ్లీ ప్రతి గడపకు చేరుస్తమని హామీ ఇచ్చారు. . వ్యవసాయాన్ని పండుగ చేస్తామని, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు మహిళ పేరు మీద కట్టిస్తమని చెప్పారు.  వైఎస్సార్ ప్రతీ పథకానికి జీవం పోస్తామన్న షర్మిల.. మొదటి సంతకం ఉద్యోగాల మంజూరు మీదనే పెడతానని ప్రామిస్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పూర్తి స్థాయి పెన్షన్ లు అందజేస్తామని స్పష్టం చేశారు.